జైశ్రీరామ్.
విభూతినీ.శ్రీవరామ.తరంగ.రయోత్సుక.దుష్ప్రభా
రాజనీతి.సుస్వార్ధ.పరచింతన. మారణహోమ.వృత్త గర్భ విధినటనావృత్తము.
రచన.వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
యుగములసింహావలోకన.ధర్మమునకుగ్లాని యేర్పడినపుడుశ్రీమహావిష్ణువు ధర్మసంస్థాపనార్ధమై
యవతారములెత్తుచుండును.నాల్గుయుగములందు కృతయుగము
ధర్మప్రపూర్ణమైనిల్చెను .త్రేతాయుగమునందు సత్యముమూడుపాదాల
నడచెను.ద్వాపరమునధర్మమురెండుపాదములకుదిగెను.శివునివెన్నాడు
బ్రహ్మహత్యాపాతకనివారణకుగాను విష్ణువు18అక్షౌహినీలబలగమును
కురుక్షేత్రమందిడుటకు నొడంబడిక కుదుర్చుకొనెను.తత్కారణమున
కృష్ణావతారముయెత్తవలసివచ్చెను.అందులకుగానుఅక్రమసంతానమునకు
తెరదీయవలసి వచ్చెను.కుండలు గోళకులవృద్ధి వారిప్రధాన్యతపెచ్చెను.అధర్మము
తో ధర్మమునిలబెట్టుటకుప్రయత్నములుకొనసాగెను.మాయలు కుతంత్రములు
కుయుక్తులనిలయమాయెను.భారతమును పంచమవేదముగాపరిగణింపబడెను
ఆనాటి సాంఘిక రాజకీయ వ్యవహారపరిస్థితులకనుకూలముగాజగనన్నాటకధారి
కృష్ణపరమాత్మయాడిన నాటకమే భారతముధర్మసంస్తాపనకు భక్తయేమూలమను
ప్రబోధ గావింపబడెను. మాయలకునెలవుగాబీజోత్పత్తి జరిగెనుకారణముబలగము
యుద్ధమునకుసమర్పించుటకే.కారణమే కరణమాయెను.ప్రస్తుత కలియుగముననొంటి
పాదమునకు చేరికొనెను.యుగయుగమునకుధర్మముదిగుభాగహారమాయెను.ఒంటి
పాదమునపట్టినధర్మమున్యాయమునకుమూడింతల లన్యాయమునొప్ప్పెను.
చరిత్ర పునరావృతము కాకతప్పదనునట్లు కుల జాతి మతఘర్షణలును.
పైసాచికృత్యములుమితిమీరుచున్నవి.నేరానికితగిన శిక్షలుకరువాయెను.
ధర్మముఛాయామాత్త్రముగనిల్చెను. నాగరికత పేరుతోయనాగరికులనుమించిన నైజము
బొడజూపుచున్నది.సంస్కారమామట్టిగలసెను ధర్మము కులబాధలకు తట్టుకొనలేక
పరుగులు తీయుచుండెను. భూగర్భనిక్షిప్తాలను మనుగడకుముప్పు వాటిలునటుల
అక్రమార్కులకబంద హస్తలలాగబడుచున్నవి.ఇంత అన్యాయ అక్రమాలకుతాళజాలక
ప్రకృతి ప్రకోపానికిగురి కావలసివచ్చుచున్నది.ధర్మము పూర్తిగా నశించుచుచివరి
ఘడియలలో ధర్మము పూర్తిగాపెరిగి కృతయుగమునకుచేర్చును.ఇదిముమ్మాటికి
నిజముపైవిషయదృష్టినందిడుకొని. ద్వాపరయుగమున విధినటనా వృత్తము
గైకొని విభూతినీ.శ్రీవరామ.తరంగ.రయోత్సుకదుష్ప్రభా.రాజనీతి.సుస్వార్ధ.
పరచింతన.మారణ దుష్ప్రభా .వృత్తములు గర్భస్తముగావింపబడినవి.
విధినటనావృత్తము.
కుండులు గోళకుల్ప్రభుత కురుక్షేత్ర సంగ్రామంబయెం దొలిగురు ద్వాపరాన
మండెను స్వార్ధ తంత్రముల మరుభూమిగామారెం తుదిన్ మలింగనశూన్యమాయె.
దండిగనుండనోపకను తరమెంచి పోరం గీడయెం తలంచను రాజ్యకాంక్ష
బండలపాలయెంబ్రతుకు పరమాత్ము మాయాజాలముం బలింగొనె ప్రాణులెన్నొ.
1.కుండులుగోళకుల్ప్రభుత
మండెను స్వార్ధ తంత్రముల
దండిగ నుండనోపకను
బండల పాలయెంబ్రతుకు.
2.కురు క్షేత్ర సంగ్రామంబయెన్
మరుభూమిగా మారెంతుదిన్
తరమెంచి పోరం గీడయెన్
పరమాత్ము మాయాజాలమున్.
3.తొలిం గురు ద్వాపరాన
మలిం గన శూన్యమాయె
తలంచను రాజ్య కాంక్ష
బలింగొనె ప్రాణులెన్నొ.
4.కుండులు గోళకుల్ప్రభుకురుక్క్షేత్ర సంగ్రామంబయెన్
మండెను స్వార్ధ తంత్రముల మరుభూమిగా మారెన్
దండిగనుండనోపకను తరమెంచి పోరం గీడయెన్
బండల పాలయెం బ్రతుకు పరమాత్ము మాయాజాలమున్.
5.కురుక్షేత్ర సంగ్రామంబయెం కుండులు గోళకుల్ప్రభుత
మరుభూమిగమారెంతుదిం మండెను స్వార్ధ తంత్రముల
తరమెంచి పోరం గీడయెం దండిగ నుండనోపకను
పరమాత్ము మాయాజాలముం బండలపాలయెం బ్రతుకు.
6.కురుక్షేత్ర సంగ్రామంబయెం కుండులు గోళకుల్ప్రభుత దొలింగురుద్వాపరాన
మరుభూమిగమారెంతుదిం మండెను స్వార్ధతంత్రముల మలింగన శూన్యమాయె
తరమెంచిపోరంగీడయెం దండిగనుండనోపకను తలంచను రాజ్యకాంక్ష
పరమాత్ము మాయాజాలముం బండలపాలయెంబ్రబలింగొనెప్రాణులెన్నొ
7.కురుక్షేత్రసంగ్రామంబయెందొలింగురు ద్వాపరాన
మరుభూమిగామారెంతుదింమలింగన శూన్యమాయె
తరమెంచిపోరంగీడయెం తలంచను రాజ్యకాంక్ష
పరమాత్ముమాయాజాలముం బలింగొనెప్రాణులెన్నొ.
8.కురుక్షేత్రసంగ్రామంబయెం దొలింగురుద్వాపరాన కుండులుగోళకుల్ప్రభుత
మరుభూమిగామారెం తుదింమలింగనశూన్యమామండెనుస్వార్ధతంత్త్రముల
తరమెంచిపోరంగీడయెం తలంచనురాజ్యకాంక్షదండిగనుండనోపకను
పరమాత్ముమాయాజాలముం బలింగొనెప్రాణులెన్నొ బండలపాలయెంబ్రతుకు
9.తొలింగురుద్వాపరాన కుండులుగోళకుల్ప్రభుత
మలింగనశూన్యమాయె మండెను స్వార్ధతంత్రముల
తలంచనురాజ్యకాంక్ష దండిగనుండనోపకను
బలింగొనె ప్రాణులెన్నొ బండలపాలయెంబ్రతుకు
10.
తొలింగురుద్వాపరానకుండులుగోళకుల్ప్రభుత కురుక్షేత్రసంగ్రామంబయెన్.
మలింగనశూన్యమాయె మండెనుస్వార్ధతంత్రముల మరుభూమిగమారెంతుదిన్
తలంచను రాజ్యకాంక్ష దండిగనుండనోపకను తరమెంచిపోరం గీడయెన్
బలింగొనెప్రాణులెన్నొ బండలపాలయెంబ్రతుకు పరమాత్ముమాయాజాలమున్.
విధినటనా.ఉత్కృతి భ.ర.న.స.య.ర.త.జ.గల.యతులు 10.19.
1.విభూతినీ.బృహతీ.భ.ర.న.వృ.సం.471.
2.శ్రీవరామ .బృహతీ.ర.య.ర.వృ.సం.139.
3.తరంగ.అనుష్టుప్.త.జ.గల.వృ.సం.173.
4.రయోత్సుక ధృతి.భ.ర.న.ర.య.ర.యతి10.
5.దుష్ప్రభ.ధృతి.స.య.ర.భ.ర.న.యతి.10.
6.రాజనీతి ఉత్కృతి. స.య.ర.భ.ర.న.త.జ.గల.యతులు 10.19.
7.సుస్వార్ధ .అత్యష్టీ.స.య.ర.జ.జగల.యతి10.
8.పరచింతనా.ఉత్కృతి.స.య.ర.జ.జ.ర.స.జ.లల.యతులు.10.18.
9.మారణహోమ.అత్యష్టీ.జ.జ.ర.స.జ.లల.యతి 9
10.గోళకప్రభా.ఉత్కృతి.జ.జ.ర.స.జ.న.జ.మ.లగ.యతులు9.18.
జైహింద్.

వ్రాసినది
Labels:












































