గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జనవరి 2017, బుధవారం

ఓం నమశ్శివాయ మంత్రంతో మారు మ్రోగిన రష్యన్ చర్చ్.

 జైశ్రీరామ్.
ఓం నమశ్శివాయ
సీ. పంచాక్షరీమంత్ర పఠన పాఠన ఫలం - బెంచిన యెవరైన పంచకున్నె?
మంచినే పెంచును పంచాక్షరీసుధ - సంచితంబులు పాపు శాంతినొసగు.
యెంచదేమతమైన మంచివారలఁ గాంచి - మహిమనే కొలుపుచు మహిని నిలుపు.
కాంచుడీబాలిక కమనీయ శివనామ - గానమాధుర్యంబు. ఘనుఁడు శివుఁడు.
గీ. మతమదేదైన మహనీయ గతిని కోరి
మతిని హైందవ తత్వమున్ మన్ననమున
కాంచి వర్తించు వారికి కమ్ర ఫలము
క్షితిని కలిగించు కనుఁడయ్య! ఘనతఁ గనఁగ.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఎక్కడి రష్యా , ఎక్కడి మన నమశ్శివాయ మంత్రం ? అద్భుతముగా నున్నది. మనదేశస్తులు , మన తెలుగును కించ పరుస్తుంటే , ఇతర దేశాలు పాటలు పాడటం వింతగా నున్నది. బాగుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.