గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జనవరి 2017, ఆదివారం

గోభిర్విప్రైశ్చ వేదైశ్చ . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభి స్సత్యవాదిభిః|
అలుబ్దై ర్దానశీలైశ్చ సప్తభిర్దార్యతే మహీ ||
గీ.మహిని గోవులు విప్రులు, మహిత వేద 
ములును, పతివ్రతల్, సత్యవా క్పూర్ణు లసమ
లుబ్ధ దూరులు దానశీలురును కలిగి
యుండుటను నిల్చె గగనాననొప్పిదముగ.
భావము. గోవులు, విప్రులు, వేదాలు, పతివ్రతలు, సత్యవచనులు, లుబ్ధులు కానివారు, దానశీలురు ఈ ఏడుగురి వల్లనే భూమి నిలిచి యున్నది.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమె కొన్ని పుణ్య శక్తుల వలననే ఈ మాత్రం ధర్మం నడుస్తోంది .ఇది అక్షర సత్యం. మంచి విషయాలను తెలియ జేసి నందుకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.