జైశ్రీరామ్.
శ్లో. తే పుత్రా యే పితృభక్తా స పితా యస్తు పోషకఃతన్మిత్రామ్ యత్ర విశ్వాసః సా భార్యా యా నివృత్తిః.
గీ. తల్లిదండ్రులఁ బ్రేమించ తనయుఁడగును.
బిడ్డలను పెంచు తండ్రియే పితృఁడగును.
మిత్ర విశ్వాస పూర్ణుఁడే మిత్రుఁడగును.
భర్త బాధలఁ బోఁగొట్ట భార్య యగును.
భావము.. తండ్రికి భక్తుడయితేనే వాడు నిజమైన కొడుకు అని గుర్తింపు లభిస్తుంది. తన తనయుడి బాగోగులు చూసికోగలిగిన నాడే నిజమైన తండ్రి అనిపించుకుంటాడు. నమ్మకంగా వున్ననాడే మంచి మిత్రుడు అవుతాడు. భర్త మనస్సుకు విశ్రాంతి ఆహ్లాదం కలిగించగలిగితేనే మంచి భార్య అగును.
జైహింద్.
1 comments:
నమస్కారములు
నిజమే మంచి కొడుకు,మంచిమిత్రుడు,మంచి భార్య గాపేరు పొందాలంటె పైలక్షణాలు ఉండాలికదా ! చాలా మంచి శ్లోకాన్ని అందించి నందుకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.