గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ష్టూడియో యన్ లో . . .

జైశ్రీరామ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమశ్శివాయ.
ఆర్యులారా!
నూతన తెలుఁగు సంవత్సరాగమన శుభవేళలో మీకందరికీ నా శుభాకాంక్షలు. 
శ్రీదేవీ హృదయాబ్జ భృంగ విలసచ్ఛ్రీ మన్మహావిష్ణువే
మోదంబున్ మిముఁ గాచుఁగావుత! మహత్పుణ్యంబు చేకూర్చుతన్,
బాధల్ కానని భక్తితత్పరతయున్, భద్రాత్మయున్, భాగ్యమున్,
శ్రీదేవీ కరుణార్ద్రదృష్టి కలుగన్ జేయున్ సదా దుర్ముఖిన్.
శుభాకాంక్షలతో
మీ
చింతా రామకృష్ణారావు.
ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ష్టూడియో యన్ లోనేను పాల్గొనిన హాస్యావధానం ప్రసారమౌతుంది. అవకాశం ఉంటే చూడగలరేమోనని తెలియజేయుచున్నాను.
జైహింద్

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కవి సమ్మేళనము నందు పాల్గొన్నవారి చిత్రమును చూడగలుగు తున్నందులకు ముదావహం.వినగలిగితే మరింత అదృష్ట వంతులము కాగలము .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.