గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఫిబ్రవరి 2016, సోమవారం

మనీషా పంచకము. కీ.శే.నేమానివారి వ్యాఖ్య.

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

28, ఫిబ్రవరి 2016, ఆదివారం

నమృత్యు ర్నశంకా న మే జాతి భేదః . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.

శ్లో. నమృత్యు ర్నశంకా న మే జాతి భేదః  పితా నైవ మే నైవ మాతా న జన్మ.
న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః. చిదానంద రూపః శివోహం శివోహమ్.
గీ . లేవు చావు భయంవులు లేదు జన్మ.
లేరు తల్లియు తండ్రియు, లేరు గురువు.
లేదు జాతి భేదము నాకు లేరు శిష్యు
లిలను బంధువుల్లేరు నేఁ దెలియ శివుఁడ.
భావము. మృత్యువు, భయము, జాతి భేదము, నాకు లేవు. నాకు తల్లి తండ్రి, బంధు మిత్రులు, గురువు, శిష్యుఁడు లేరు. నేను చిదానంద రూపుఁడను,  శివుఁడను, నేను శివుఁడను. 
జైహింద్.

27, ఫిబ్రవరి 2016, శనివారం

“విశాఖ శతావధానము” Sri Rambhatla Parvatheeswara Sarma.

1 comments

జైశ్రీరామ్.
శతావధాని. రాంభట్ల పార్వతీశ్వర శర్మ.

“విశాఖ శతావధానము” లోని
మొదటి సమస్య.
కడిమిళ్ళ శ్రీవిరించి గారు, నరసాపురం.
రాతికి మ్రొక్కువారికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యెడిన్
పూరణ:
పోతనతొల్లివ్రాసెనయ పొల్పుగ భావతమ్మునందు, క్షో
ణీతలరాజసింహమవనిన్ పరిపాలనఁ జేసియుండె, వి
ఖ్యాతినిఁగన్న రామునకు, కార్యముఁదీరగ నెంచి రావణా
రాతికి మ్రొక్కువారికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యెడిన్!
2వ సమస్య.
బి.వి. బంగార్రాజు గారు, విశాఖపట్నం.
ఉగ్రవాదమె విశ్వమందున యుక్తమైనది చూడగన్
పూరణ :
అగ్రగామిగ నున్న దేశపుటంచులన్ గలదెప్పుడున్
భూగ్రహమ్మున కక్షఁ దెల్పుచు పొందికల్ విడనాడుచున్
ఆగ్రహించుచు శాంతిఁ గూల్చగ నల్లలాడ ప్రజాళియే
ఉగ్రవాదమె విశ్వమందున యుక్తమైనది చూడగన్
3వ సమస్య
కోడూరు శ్రీలక్ష్మి గారు, విశాఖపట్నం.
ప్రవరుడునవ్వరూథినిని పట్టి సుఖించె హిమాలయంబునన్
పూరణ :
జవముననేగెనాద్విజుడు చక్కగశీతనగమ్ముఁగానగా
నవిరళ హోమతత్పరున కంద వరూథిని కోర్కెఁదెల్పె సం
స్తవమునఁబొందెనగ్నికృప, సాగెనుగీమున, కంత శాంబరీ
ప్రవరుడునవ్వరూథినిని పట్టి సుఖించె హిమాలయంబునన్
4వ సమస్య
కన్నేపల్లి వరలక్ష్మి గారు, విశాఖపట్నం.
మానవత్వము వీడి సోదర మంచిగా నివసింపుమా
పూరణ. :
గ్లానికల్గక యుండ మిత్రులఁ గావఁ జెల్లును ప్రేమతో
పూని తోడయి కావ్యరాశిని పుణ్యముల్గొన లెస్సయౌ
హానిచేయగ, నంతముంగొన నక్కటా! మతమందురే
మానవత్వము వీడి; సోదర మంచిగా నివసింపుమా.
5వ సమస్య
కారె అనూరాధ గారు, విశాఖపట్నం.
బాంబులు భారతావనికి బంగరు పంటలు కూర్చు మిత్రమా
పూరణ :.
సాంబుని సత్కృపంగొనగ సర్వము మంగళమౌట తథ్యమౌ
వెంబడి వచ్చు సంపద, వివేకము వృద్ధిఁగనున్ స్థిరమ్ముగా
సంబరమై కృషీవళులు సంతసమందగ, మేఘ సత్కదం
బాంబులు భారతావనికి బంగరు పంటలు కూర్చు మిత్రమా
6వ సమస్య
కొప్పిశెట్టి సూర్యనారాయణ గారు, విశాఖపట్నం.
కన్నముఁ బెట్టువాని ననఘాయని పిల్చిన సార్థకంబగున్
పూరణ :.
కన్నదిగాని విన్నదియుఁ గాని యొకానొక క్షామమక్కటా
దున్నగ భూమియున్నపరితోషముఁ గల్గునె చూడఁ జూడ రై
తన్నకు, జాతినంతటిని నాదరమొప్పగఁ గాచు వాడ! నీ
కన్నముఁ బెట్టువాని ననఘాయని పిల్చిన సార్థకంబగున్ 
7వ సమస్య
డా. ఎల్. ఎస్. యాజ్ఞవల్క్య శర్మ గారు, విశాఖపట్నం..
కవిత కనరాదు తిక్కనకవితలోన
నిత్యసాధనన్ విద్యార్థి ప్రత్యయముల
శేషషష్ఠికి ’యొక్క’ విశేషమమరు
“కవితక నరాదు తిక్కనకవిత”లోన”
సవ్యమౌను “నిర్ధారణషష్టి”నెపుడు.
(కవిత కు అనరాదు నిర్ధారణ షష్ఠి లో కవితలోన అనాలి అని భావము)
8వ సమస్య 
బెహరా వెంకటలక్ష్మి గారు, విశాఖపట్నం.
పాపము లేనిచో జగతి పాడయిపోవును నిశ్చయమ్ముగన్
లోపము సద్గుణమ్మనగ లోకమునందునఁజెల్లు రెండు నా
దీపపు నీడవెల్గులన దివ్యముగా మన సృష్టికర్థమై
ప్రాపుగఁ గాచు పుణ్యము; ప్రపంచముఁ గూల్చు నఘమ్ము; పుణ్యమున్
పాపములేనిచో జగతి పాడయిపోవును నిశ్చయమ్ముగన్.
9వ సమస్య.
బత్తుకొండ నాగలక్ష్మి గారు, విశాఖపట్నం.
చరణంబులు లేనివాడు చకచకనడిచెన్
తరియించి జీవవార్థిని
నరుడొక్కడు పట్టెనంత నాకపు త్రోవన్
ధరనింతయు దుష్కర్మా
చరణంబులు లేనివాడు చకచకనడిచెన్.
10వ సమస్య
గుత్తి పుష్పలత గారు, విశాఖపట్నం.
అత్తకు మీసముల్ మొలిచె నల్లుడు వచ్చిన వేళ యెట్టిదో
తత్తరపాటునన్ వనిత తల్లికి చెప్పగనేగెనింటికిన్
వత్తురె బంధురాశియని వంటలు జేయగ నెంచెనామె, యా
యత్తముఁజేయ భోజనము హంగులతో మసియంట మోమునం
దత్తకు, మీసముల్ మొలిచె నల్లుడు వచ్చిన వేళ యెట్టిదో .
జైహింద్.

26, ఫిబ్రవరి 2016, శుక్రవారం

సత్యమేవ జయతే నానృతమ్ . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
మంత్రము. 
సత్యమేవ జయతే నానృతమ్
సత్యేన పంథా వితతో దేవయానః
యేనాక్రమాంత్యా ఋషయోహ్యాప్తాకామా
యాత్ర తత్సత్యస్య పరమం నిధానమ్. (ముండకోపనిషత్ 3.1.6)
క. సత్యమె జయమును పొందున
సత్యము జయమొందఁబోదు.సత్య సుమార్గౌ
న్నత్యము దివ్యులెఱుకయి,
సత్య పథంబున శుభంబు సతతము కోరున్
భావము. సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా దివ్య (దేవ)మార్గం అవగతమౌతుంది. ఆ మార్గంలోనే ఋషులు తమ అభీష్టాలను వెరనేర్చుకొని పరమ నిధానాన్ని చేరుకోగలిగారు.
జైహింద్.

25, ఫిబ్రవరి 2016, గురువారం

జకారో జన్మ విచ్ఛేదః . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. జకారో జన్మ విచ్ఛేదః - పకారో పాప నాశన:.
జన్మ చ్ఛేద కరో యస్మాత్పమిత్యభిదీయతే.
గీ. జన్మ రాహిత్యమగునుజ, సకల మైన
పాప సంహారమగునుప, పట్టు పట్టి
జపము భక్తిగ చేసిన జన్మ లేమి
మనకు ప్రాప్తించు. చేయుడు మనుజులార!
భావము. జ అనగా జన్మ రాహిత్యము. ప అనగా పాప నాశనము.  జపముము అనగా పాపము నశింపఁ జేసి జన్మరాహిత్యమును అనుగ్రహించునది.
కావున జపము చేయునప్పుడు మంత్రమునందు మనస్సు నిలిపి,  తద్భావమును తలపోయుచు,  జపము చేసినచో భావ పరిపుష్టితో పాటు జప పరిపుష్టి కూడా ప్రాప్తించి,  మంత్ర సిద్ధి కలుగును.
జైహింద్.

24, ఫిబ్రవరి 2016, బుధవారం

రాజా రాష్ట్ర కృతం పాపం . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. రాజా రాష్ట్ర కృతం పాపం!  -  రాజపాపం పురోహితః!
భర్తా చ స్త్రీకృతం పాపం!   -  శిష్యపాపం గురుర్వ్రజేత్!! (భోజచరితమ్)
గీ. ప్రజల పాపంబు రాజుకు ప్రాప్తమగును.
రాజు పాపంబు గురువుకు ప్రాప్తమగును.
స్త్రీల పాపంబు భర్తలఁ జేరుచుండు
శిష్య పాపంబు గురువులఁ జేరు నిజము.
భావము. రాష్ట్రములోని ప్రజలు చేయు పాపములు రాజును పొందును; రాజు గావించు పాపములు పురోహితుని పొందును, స్త్రీలు చేయు పాపములను భర్తలకు సంక్రమించును. శిష్యుల పాపములు గురువునకు సంక్రమించును. అనగా రాజు ప్రజలను,పురోహితుడు రాజును,భర్త భార్యను, గురువు శిష్యులను, మంచిమార్గమున నడచుకొనునట్లు చూడవలసిన బాధ్యత గలవారని భావము.  
జైహింద్. 

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

నవగ్రహాల తల్లిదండ్రులు & భార్యలు పేర్లు

1 comments

 జైశ్రీరామ్.
01. రవి[సూర్యుని] తల్లిదండ్రులు అతిది - కశ్యపులు. భార్యలు ఉష,- ఛాయ.
02. చంద్రుని - తల్లిదండ్రులు అనసూయ - అత్రి మహర్షి - భార్య రోహిణి .
03. కుజుని- తల్లిదండ్రులు - భూమి, భరద్వాజుడు - భార్యశక్తి దేవి
04. బుధుని - తల్లిదండ్రులు - తార, చంద్రుడు - భార్య జ్ఞాన శక్తి దేవి
05. గురుని - తల్లిదండ్రులు - తార, అంగీరసుడు - భార్య తారాదేవి
06. శుక్రుని - తల్లిదండ్రులు - ఉష,భ్రుగు - భార్య సుకీర్తి దేవి
07. శని - తల్లిదండ్రులు - ఛాయ, రవి - భార్య జ్యేష్ట దేవి
08. రాహువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు - భార్య కరాళి దేవి
09 కేతువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు - భార్య చిత్రా దేవి.
జైహింద్.

22, ఫిబ్రవరి 2016, సోమవారం

శక్వరీ ఛందసంబంధ వృత్తములు. . . . శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభ.కృత శక్వరీ ఛందసంబంధ వృత్తములు తిలకించండి.
జైహింద్.

21, ఫిబ్రవరి 2016, ఆదివారం

శ్రీ వల్లభ ఛందో మదనము . . . శ్రీవల్లభ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

20, ఫిబ్రవరి 2016, శనివారం

శ్రీవల్లభ ఛందో మదనము. . . . శ్రీవల్లభ.

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

19, ఫిబ్రవరి 2016, శుక్రవారం

కృతి ఛందములు. .... శ్రీవల్లభ

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

18, ఫిబ్రవరి 2016, గురువారం

శ్రీవల్లభ ఛందోమదనము. . . . శ్రీ వల్లభ,

2 comments

జైశ్రీరామ్.
జైహింద్.