జైశ్రీరామ్.
శ్లో జరా రూపం హరతి ధైర్య మాశా , మృత్యుః ప్రాణాన్ ధర్మచర్యా మసూయా ,కామో హ్రియం వృత్త మనార్యసేవా , క్రోధః శ్రియం సర్వ మేవాభిమానః.
గీ. వృద్ధతను రూపు చెడిపోవు పెరుగు దైర్య
మాశను హరించు, మృత్యువు ప్రాణముఁ గొను,
నరయ ధర్మమసూయనుహరణ సేయు
కామమునసుగ్గు, కోపాన కనగ శ్రియము,
దురభ్మానాన సర్వమున్ దూరమగును.
భావము. ముసకితనము అందమైన రూపురేఖలను నశింపఁజేయును. ధైర్యము ఆశను నశింపఁ జేయును. మృత్య్వు ప్రాణమును తీసివేయును. ధర్మ ప్రవర్తన అసూయ యనునది లేకుండా చేయును. కామము సిగ్గును హరించివేయును. సత్ప్రవృత్తి అనార్య సేవనుండి దూరము చేయును. కోపము శ్రేయమును హరించును. దురభిమానము అన్నిటిని హరించును.
జైహింద్.
2 comments:
ఆశను అధైర్యం కదండీ నశింపజేయగలిగినది? ఆశ అంటే ఎలా పొసుగుతుంది? మూలంలో దోషమున్నట్టుంది!
నమస్కారములు
అవును ఈ వార్ధక్యము నిజంగా ఒక పెద్దశాపము . మార్పులేని మనస్సు ఎప్పుడూ పిడికెడే . చుట్టూ బాధించే మార్పులకి మనస్సు తట్టుకో లేక మనస్సు పడే నరకం. [ రాజీ పడలేక} వర్ణనాతీతం . మంచి శ్లోకం . ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.