గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2015, గురువారం

పరోపి హితవాన్ బంధుః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. పరోపి హితవాన్ బంధుః బంధురప్యహితః పరః
అహితో దేహజో వ్యాధిః హితమారణ్యమౌషధం.
గీ. హితకరుండిల పరుఁడయ్యు బంధువతఁడు.
బంధువహితకరుండైన పరుఁడె మనకు
రోగభాగంబు దేహాన రోత గాదె?
రోగమును బాపు వనజ మారోగ్యమనమె?
భావము.మన హితమును కోరువారు పరులైనప్పతికి మనకు బంధువులే. మనకహితమును కూర్చువారు మన బంధువులైనప్పటికీ వారు పరులే. వ్యాధి సోకియున్నది మన శరీర భాగమైనను అది అహితమే. అదవియందుద్భవించినదైనను శరీరమునకు మేలుకూర్చెడి ఔషధము మనకు హితమేకదా!  
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చక్కని శ్లోకాన్ని చెప్పారు మనకి హితమైన వారెగానీ వారికి మనం హితము కావాలని ఎక్కడుంది ? అందుకే మనకి దగ్గరగానే ఉన్నా మనసులు ఎంతోదూరం బాగుంది .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.