గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జూన్ 2015, మంగళవారం

పద్మాకరం దినకరో వికచం కరోతి ... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.
శ్లో. పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్
నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి సంతస్స్వయం పరహితే విహితాభియోగాః!!
క. కోరకనెవిరియఁ జేయును
నీరజముల రవి, కలువల నేర్పున శశియున్.
నీరదుఁడు వర్షమిచ్చును
సూరులుపకృతిమతులగుచు శోభిలుదురిలన్.
భావము. తామరలచే సూర్యుడు యాచింపబడకయే వానిని వికసింపజేయుచున్నాడు. కలువలచే చంద్రుడు యాచింపబడకయే వానిని వికసింపజేయుచున్నాడు. జనులచే మేఘుడు యాచింపబడకయే జలము గురిపించుచున్నాడు. గావున సుజనులు పరులు యాచింపకయే వారలకు సహాయము చేయుదురు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమె కానీ అడిగినా ఇవ్వని రోజులివి .సుజనులు చాలా తక్కువ శ్లోకం చాలా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.