జైశ్రీరామ్.
శ్లో. పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి సంతస్స్వయం పరహితే విహితాభియోగాః!!
క. కోరకనెవిరియఁ జేయును
నీరజముల రవి, కలువల నేర్పున శశియున్.
నీరదుఁడు వర్షమిచ్చును
సూరులుపకృతిమతులగుచు శోభిలుదురిలన్.
భావము. తామరలచే సూర్యుడు యాచింపబడకయే వానిని వికసింపజేయుచున్నాడు. కలువలచే చంద్రుడు యాచింపబడకయే వానిని వికసింపజేయుచున్నాడు. జనులచే మేఘుడు యాచింపబడకయే జలము గురిపించుచున్నాడు. గావున సుజనులు పరులు యాచింపకయే వారలకు సహాయము చేయుదురు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
నిజమె కానీ అడిగినా ఇవ్వని రోజులివి .సుజనులు చాలా తక్కువ శ్లోకం చాలా బాగుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.