జైశ్రీరామ్.
శ్లో. జ్ఞాతిభి ర్వంచతేనైవ, చోరేణాపి న నీయతే|దానేన న క్షయం యాతి, విద్యారత్నం మహాధనం|| (చాణక్యనీతి)
గీ. జ్ఞాతులెవ్వరుఁ గొనలేని, కలుష మతులఁ
జోరులెవ్వరు గొనలేని, సుజన తతికి
దానమెంతగ చేసినన్ దరుగఁబోని,
విద్య మహనీయ రత్నమౌన్, విబుధులకును.
భావము: జ్ఞానముపెన్నిధి వంటిది. అది జ్ఞాతులువంచించి తీసుకోడానికి వీలులేనిది; దొంగలు అపహరించ లేనిది; దానము చేసినా తరగలేనిది పైగా వృద్ధినొందునది; ఇదిఒక అనర్ఘరత్నము.
జైహింద్.
1 comments:
నమస్కారము
అవును విద్య అనునది ఎవరు అపహరించలేనిది . మేలిమి బంగారము . మణి కౌస్తుభము చాలా బాగుంది .ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.