జైశ్రీరామ్.
శ్లో. కాలస్యామూల్యతాం జ్ఞాత్వా తద్వృధాయాపనం మహాదోషస్స్యాదితి నిశ్చిత్య సత్కాలక్షేప మాచర!!
గీ. కనఁగ కాలమమూల్యము. కాన మనకు
కాల యాపన దోషంబు. కలుఁడు నిజము.
మంచి పనులకు కాలముఁ బంచి నడవ
జన్మసార్థక్యమగు నిది సజ్జనోక్తి.
భావము: కాలము అమూల్యమైనదని తెలుసుకొని, దానిని వ్యర్థము చేయడం మహా దోషమను నిశ్చయబుద్ధితో కాలమును సదుపయోగము కావించవలె.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును ఒక్కక్షణం వెనక్కి వెళ్ళినా మళ్ళీ తిరిగి రాదు కానీ మనకి తెలియ కుండానె మనం ఎంతో కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నాము . మంచి సూక్తి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.