గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, డిసెంబర్ 2013, ఆదివారం

శ్రీ చక్ర బంధ సప్త స్వర సర్వ మంగళాష్టకము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మద్విరచితమైన శ్రీ చక్ర బంధ సప్త స్వర సర్వ మంగళాష్టకము. తిలకించ మనవి.

శ్రీ చక్ర బంధ సప్త స్వర సర్వ మంగళాష్టకము.

కలమీవమ్మ శ్రీ గౌరిసత్ప్రశంస
సహజ పాండిత్య శ్రీనిమ్ము సత్సుపోష
రమ్ము వర చిత్ర శ్రీ కృతి నిమ్ము దేవి
సరస కారణసత్పోష  సద్ విభా.
రిక్త జగతిని శ్రీ శక్తి ప్రేరణంబు
విశ్వ జనయిత్రి శ్రీ మాతవేల్పుసాని.
శివుని శక్తియు శ్రీమాత, శ్రీలఁ ద్రేల్చు
రిపు వినాశిని  బుద్ధిని వ్రేల్చు గౌరి.
ర్వమణచఁగ శ్రీమాత, కల్గు శోభ.
మురియఁ బ్రార్థింప శ్రీదివ్య మూర్తి మ్రోల.
జేజె హర సతి శ్రీకాళి చేరి బ్రోచు.
గమ్యమును జేర్చిభక్తులఁ గాచు వే.
మ్ము కరుణించు శ్రీ జగన్మాత వేగ !
రమ్య గుణ ధామ శ్రీ కావ్య రమ్య భాస.
హిమ తనూద్భవ శ్రీ హర హృత్సుమాన్య
మధుర సాహిత్య గణ్యసన్ మాన్య నా !
రమ పావని ! శ్రీ చక్ర భాస ! నాదు
మనవిఁ గైకొని శ్రీఁ గొల్పు మంచి నెంచి
కలుఁగఁ జేయుమ శ్రీ భక్త కల్ప సేవ్య!
రమ శ్రీకరీ ! దుర్గ ! చిత్   భవ్య రూ!
త్తి శుభ గుణ శ్రీఁ గొల్పు తప్పునీక
నిన్నుఁ గనుఁగొను శ్రీదృష్టి నన్నుఁ గాచు.
చేవ కనఁ జూపిశ్రీకరీచీల్చు కర్మ.
ధక్షునిఁగ చేవ కల్గించు  ధర్మ మొం!.
నిత్య శుభదాయి శ్రీ భవానీ శుభాంక
మర్మ మెఱుఁగని శ్రీ బుద్ధి కూర్మిఁ దేల      
తోడ నొసఁగుచు శ్రీదేవి నీడఁ గొల్పు.
నిష్ఠమదితోన కన్నుల  నిల్పు దేని.
 రి గ మా ప ద శ్రీ ని సత్స్వర్ణమాల
సకల పాఠక శ్రీజ్ఞాన సౌఖ్య దాత.
కనఁగ మంగళ శ్రీ యష్టక స్థ నిత్య,
సరస సత్కవి లక్షిత సత్యభా!
జైహింద్.

Print this post

3 comments:

anantha krishna n.v. చెప్పారు...

'చిత్ర కవితా సమ్రాట్' చింతా రామకృష్ణారావు గారికి
అనేకానేక నమస్సులతో
ఇంత చక్కని యంత్ర బద్ధ 'చిత్రాన్ని' అందించినందుకు కృతజ్ఞతలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆహా ! ! !
అద్భుతం కనీ వినీ ఏరుగని నాకు కన్నుల విందు.ఎలా అభినం దించాలో నా
భాష కందడం లేదు.దిగి వచ్చిన వాగ్దేవికి పాదాభి వందనములు

కందుల వర ప్రసాద్ చెప్పారు...

ధన్యులము గురువర్యా !
ఆహా ! అద్భుతం!
మీ మద్విరచితమైన శ్రీ చక్ర బంధ సప్త స్వర సర్వ మంగళాష్టకము జుచితిమి.
మీ వంటి వాగ్దేవికి పుత్రులకు పాదాభి వందనములు జేయుచు .
వరప్రసాదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.