జైశ్రీరామ్.
జ్ఞానామృత పాన లోలులారా! కవివతంస బిరుదాంకితులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు కవి కృత శివాలాపము నారికేళ పాకమో, కదళీ పాకమో, ద్రాక్షాపాకమో చదివి మీరే నిర్ణయించండి. తాను విద్యార్థిగా ఉన్న రోజులలోనే ఈ శివాలాపము రచన చేసిన సుకవి
శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
ఇక చవిచూడండి ఈ శివాలాపము 5 వభాగాన్ని. నమస్తే.
శివాలాపము. 41 నుండి 50.
శా:- లోకమ్మెట్లు చరించుచున్నదియొ, ఆలోకించినావే? మహే
శా కాఠిన్యము లంతరంగములలో స్వార్ధ క్రియల్ బుద్ధిలో
నైకోద్రిక్త దురంత భావ ఘటనాంతర్భూత దాహ చ్ఛటా
నీకమ్మార్పగ రావె, దివ్య తటినీ నిర్ణిద్ర జూటా! శివా! 41.
శా:- నీ పాదమ్ముల యాన. నిక్కము సుమీ! నీ నామ మాధ్వీక ధా
రా పానోద్ధత ముక్తి వాంఛ కలనా రాగాంకుర ప్రౌఢిమ
శ్రీ పారంగత బుద్ధి దక్క పరముం జింతింప. దుర్మోహ సం
తాప ప్రాభవ దుఃఖముంజితుపు మన్నా! వ్యోమ కేశా! శివా! 42.
శా:- నిష్కాపట్యముగా వచించెదను తండ్రీ! భక్త మందార! శో
చిష్కేశాంకుర దీప్త దేహ ఘటిత శ్రీ జ్ఞాన యోగ ప్రభా
నిష్కామైక పథమ్మునన్ వెలుగువున్నీవే తమో హేలలన్
శుష్కీభూతము సేయవే! పరివహత్ శుభ్రాంశుతేజా! శివా! 43.
శా:- ఎట్లో పైకెగబ్రాకమందువవు నీకేమయ్య? నా దేహమున్
గాట్లై యున్ననుఁ ద్రాటి పట్టెకెదురెక్కం ద్రోయు చున్నావు.నా
పట్లెల్లం జెడి భీతి నొందితి ధరాభాగమ్ముపై కూల్తువో?
పాట్లుం జాలును కాంక్షితమ్ము నెరవేర్పన్ రమ్ము వేగన్, శివా! 44.
శా:- స్పూర్జత్తాండవ లీల నా యెడకు రావో, తోడు కావో, సదా
గర్జానేకము లోహితాక్షి ముఖ భంగమ్మున్ మహా వ్యాఘ్రమున్
నిర్జింపం దలపోతు, వ్యాఘ్రమది తండ్రీ మోహమయ్యా! శర
త్ ఫర్జన్యామల కాంతి సుందర కటి వ్యాఘ్రాజిన శ్రీ. శివా! 45.
శా:- గ్రీవా దఘ్నముగా నిలంబడితి తండ్రీ! ఘోర దుర్వార వీ
చీ విస్తారిత మోహ బంధ జలధిన్ శీఘ్రమ్ముగా సత్కృపా
ప్రావీణ్యంబు కరావలంబన విధిం బండిచి నన్నొడ్డు తే
వే! వేదాఖిల మార్గ సంస్తుత! కృపా పీయూష ధారా! శివా! 46.
శా:- ఆజన్మాంతము నిల్చునంచు తలచున్నైశ్వర్య సౌదామినిన్
భ్రాజద్భోగము శాశ్వితమ్మనుకొనున్ పత్రాగ్ర వార్బిందువున్
శ్రీ జాడ్యాగత దుష్ట మానవులు వాసింపంగ త్వత్ పాద పూ
జ జన్యాగతనిత్య భోగ మెదపై సంధింపరయ్యా! శివా!. 47.
శా:- స్వః కాంతా కర పద్మ సంగ్రహణ నిష్టా భావముం గాని, స
ద్యః కల్యాణమిహైక భోగ చయ భాగ్యానీకముంగాని, తే
జః కైవల్యద మూర్తి, కోరను సదా జన్మాగతంబౌమదే
నః కూలంకష వీచి శాంతి పఱుపన్ కాంక్షింతు నింతే శివా! 48.
శా:- భోళా శంకరుడన్న పేరు కద శంభో నీకు, రావేమి? శ
య్యాలంకారము సాహితీ విమల దీవ్యత్ స్తోత్రముల్ జేసినన్?
ప్రాలేయాచల కన్యకా రచిత సేవా సౌఖ్య సంభావనా
కైలాసాచల వాసముల్ విడిచి రాగా వొప్పవేమో! శివా! 49.
శా:- స్పష్టాస్పష్ష్టము జ్ఞాన రేఖ లవియున్ భాసించు వెన్కన్ కృధా
వష్టంభోజ్వల మోహముల్ నిలుచు ఘోరాకారమై, రెంటికిన్
ముష్టాముష్టి కచా కచీ యెడదలో! మోహాంధమున్ త్వన్మహా
దృష్టిం బారఁగఁ జేసి కాంతి చయ మీవే . అంధకారీ! శివా!. 50.
(సశేషం)
జైహింద్.

1 comments:
నమస్కారములు
కవి వతంసులు శ్రీ బులుసు వారి పద్య రత్నములు ఆంధ్రామృతమునకే తలమానికము. ఆదేవి కృపా కటాక్షమును పొందిన ధన్యులు
చింతా వారికి కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.