గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, నవంబర్ 2012, గురువారం

శ్రీ ఏల్చూరి మురళీదర రావు గారి కోరిక మేరకు ఉంచిన నాగ బంధము, అష్ట నాగ బంధము.

జైశ్రీరామ్.
శ్రీ  ఏల్చూరి మురళీ ధర రావు
సోదరులారా! శ్రీ  ఏల్చూరి మురళీ ధర రావు  ఇలా వ్యాఖ్యానించారు.
పుంభావసరస్వతి పూజ్యశ్రీ పండిత నేమాని గురుదేవులకు,
మధురకవి శ్రీ చింతా రామకృష్ణారావు గారికి,
విద్వన్మిత్రమండలికి,
విజయదశమీ పర్వదినాన సర్వ శుభాకాంక్షలు! 
భవదీయుడు,
ఏల్చూరి మురళీధరరావు.
మాన్యశ్రీ రామకృష్ణారావు గారు!
శ్రీ వల్లభవఝల వారి చిత్రకవితాప్రణయనం మనోహరంగా ఉన్నది. వారికి నా హృదయపూర్వకాభినందనలను తెలియజేయండి.మీవి, వారివి ముద్రితరచనలు ఏమేమున్నాయో తెలుపగలరని ప్రార్థన. 
కాగా; మీరు కాని, మీ మిత్రమండలి సదస్యులు కాని, శ్రీ వల్లభవఝల వారు కాని "నాగబంధము"లో ఏవైనా ప్రయోగాలను చేసినా, అటువంటి ప్రయుక్తాలను మీరెక్కడైనా చూసినా - దయచేసి తెలియజేయగోరుతున్నాను.
భవదీయుడు,
ఏల్చూరి మురళీధరరావు . 

వీరి కోరిక మేరకు కుమార సంభవమునందలి నాగబంధమును ఈ క్రింద చూపిస్తున్నాను.
డా.డీ.యస్.గణపతిరావు కృత కుండలి నాగ బంధము  అష్ట నాగ బంధము కూడా చూడండి.


జైహింద్.

Print this post

5 comments:

Pandita Nemani చెప్పారు...

మురళీధర విద్వన్మణి
కరుమరుదగు మణిని బోలు కవిమిత్రులలో
వరహృదయుడు రసపూర్ణుడు
సురుచిర యోగమ్ములొంది శోభిలుత సదా!

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

మాన్యశ్రీ రామకృష్ణారావు గారికి
నమస్సులతో,

"నాగబంధము"ను సచిత్రంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. డా. దేవగుప్తాపు గణపతిరాయ కవిగారిని అధికరించి కొత్తగా చెప్పగలదేముంటుంది? కందపద్యంలో వారి ప్రయోగం అమోఘంగా ఉన్నది.

మీరిచ్చిన చాయాచిత్రంలోని కవి శ్రీ గణపతిరావు గారో, శ్రీ వల్లభవఝల వారో స్పష్టంగా తెలియలేదు.

సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! మురళీధర రావు గారూ! మీ సహృదయతకు ధన్యవాదాలు.
ఆ నాగ బంధాలు ఎవరి రచనో తెలియ లేదన్నారు.
ఆ చిత్రాలకు పైన నేను వ్రాసినదానిని బట్టి, ఆ చిత్రాలపై గల వారి పేర్లను బట్టి ఆ నాగ బంధాలు ఎవరి రచనలో మీకు తెలుస్తాయని తెలియజేసుకొంటున్నాను.
శ్రీ వజ్ఝల వారు వ్రాసిన నాగబంధం ఏదీ నేనుంచిన వాటిలో లేదు. పై ఒక్క నాగ బంధం మినహా మిగిలిన రెండూ శ్రీ దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు రచించినవేనని మనవి చేయుచున్నాను.
మీరు నో రిప్లై ద్వారా వ్యాఖ్యానిస్తున్నందున మీకు నేరుగా లేఖ వ్రాద్దామన్నా కుదరటం లేదు. దయ చేసి మీ ఈ మెయిల్ ఐడీ తెలియ జేయ మనవి.
నమస్తే.

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

సుకవివరేణ్యులు మాన్యశ్రీ రామకృష్ణారావు గారికి
నమస్సులతో,

నిరంతరాయితమైన మీ వ్యాసంగం నాకెప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది. మీ సహృత్స్పందనకు ధన్యవాదాలు.

ఆ నాగబంధాలు ఎవరి రచనమో నేను అడుగలేదు. ఏ నాగబంధరచన ఎవరిదో మీరు స్పష్టంగానే పేర్కొన్నారు.

నేను అడిగినది పైని ఈ వ్యాసంలో మీరిచ్చిన ఛాయాచిత్రం (ఫోటో) లో మైకుముందు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? వారి పేరేమిటి? వారు శ్రీ గణపతిరావు గారా? శ్రీ వల్లభవఝల వారా? అని.

నాకు వారిద్దరూ పరిచయం లేనందున ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలిసికొనగోరి అడిగాను. దయచేసి తెలియజేయ ప్రార్థన.

సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

NOT FOR PUBLICATION IN THE BLOG:

Respected Sir,

You have my Email ID already as

With regards,

Sincerely,
Elchuri Muralidhara Rao

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.