జైశ్రీరామ్.
శ్లో:-
జ్ఞాతిభిః వంచ్యతేనైవ - చోరేణాపి ననీయతే.
దానేన న క్షయం యాతి - విద్యా రత్నం మహా ధనమ్.
క:-
జ్ఞాతులు పంచుకు పోనిది.
ఏతరి దొంగిలగరాని దెంతగనైనన్
ప్రీతిని దానము చేసిన
ఖాతిగ పెరిగెడిది విద్య. ఘన రత్నమిలన్.
భావము:-
జ్ఞానము పెన్నిధి వంటిది. అది జ్ఞాతులు వంచించి తీసుకొనుటకు వీలు పడనిది. దొంగ లపహరింప జాలనిది. దానము చేసిననూ తరుగనిది. .అది ఒక అనర్ఘ రత్నము.
జైహింద్.
Print this post

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.