గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జూన్ 2012, ఆదివారం

ఈ సీస పద్యంలో ఎన్ని విభిన్న ఛందస్సులు గల పద్యాలు గర్భితమై ఉన్నాయో గుర్తించారా?

జైశ్రీరామ్.
ప్రియ సాహితీ బంధువులారా! శ్రీమాన్ పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారు శ్రీ కంది శంకరయ్య గారు నిర్వహించుచున్న శంకరాభరణం బ్లాగు ద్వారా గర్భ కవిత్వమును గూర్చి మంచి సూచనలను చేస్తున్నది చూచి స్పందించిన నేను నా ప్రియ మిత్రులు కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు నుద్దేశించి ఒక పద్యం వ్రాస్తూ ఈ ప్రయోగం చేయ సాహసించాను. సహృదయంతో గమనిస్తారని ఆశిస్తున్నాను.
1.చంపక – 2.మధ్యాక్కర – 3.నర్కుట - 4.కోకిలక – 5.మణి భూషణ – 6.ద్రుతవిలంబిత  –
7.ద్వివిధ కంద ద్వయ – 8.గీత – 9చతురంగ బంధ ఆటవెలది, 10.చతురంగ బంధ కంద గర్భ
సీసము.
సీ:-శ్రిత జన శ్రీకరా! స్థిర వరేణ్యుని ధీవిగ శ్రీదయాళి నో కవిగఁ గొలిపి,
     క్రతు వన రా కకై కరుణ గాంచునగాశ్రయ క్ష్మానునేలుచున్ హాయిఁగొలిపి,
     నత గణనా కవీ! నర మనంబున నంటున జ్ఞావిధాన! భో! నగ సమాన!
     తత వినుతా కనన్ తరమ ధాత్రిని తత్కళ! త్రా విభావ! ధీ! మిత్ర వరుఁడ!
గీ:-కవన విజయ ఘనుఁడ ! కళ కన వలె కవు  
     ల కవితన. సుగుణత, లయల, కద నుడులు!
     గవి నెదఁ గను సుకవి కఱుకని  వలువల    
     నిగనిగ లుబుకు నిధి నిడి నిలుపును ధర.
1. సీస గర్భస్థ చంపకమాల:-
    శ్రిత జన శ్రీకరా! స్థిర వరేణ్యుని ధీవిగ శ్రీదయాళి నో ,
    క్రతు వన రా కకై కరుణ గాంచునగాశ్రయ క్ష్మానునేలుచున్,
    నత గణనా కవీ! నర మనంబున నంటున జ్ఞావిధాన! భో !
    తత వినుతా కనన్ తరమ ధాత్రిని తత్కళ! త్రా విభావ! ధీ!
2. సీస గర్భస్థ మధ్యాక్కర:-
    శ్రిత జన శ్రీకరా! స్థిర వరేణ్యుని ధీవిగ శ్రీదయాళి.
    క్రతు వన రా కకై కరుణ గాంచునగాశ్రయ క్ష్మాను
    నత గణనా కవీ! నర మనంబున నంటున జ్ఞావిధాన!  
    తత వినుతా కనన్ తరమ ధాత్రిని తత్కళ త్రావి!
3. సీస గర్భస్థ నర్కుటము:-
    శ్రిత జన శ్రీకరా! స్థిర వరేణ్యుని ధీవిగ శ్రీ ,
    క్రతు వన రా కకై కరుణ గాంచునగాశ్రయ క్ష్మా  ,
    నత గణనా కవీ! నర మనంబున నంటున జ్ఞా !
    తత వినుతా కనన్ తరమ ధాత్రిని తత్కళ! త్రా !
4. సీస గర్భస్థ కోకిలకము:-
    శ్రిత జన శ్రీకరా! స్థిర వరేణ్యుని ధీవిగ శ్రీ ,
    క్రతు వన రా కకై కరుణ గాంచునగాశ్రయ క్ష్మా  ,
    నత గణనా కవీ! నర మనంబున నంటున జ్ఞా !
    తత వినుతా కనన్ తరమ ధాత్రిని తత్కళ! త్రా !
5. సీస గర్భస్థ మణిభూషణము:-
    శ్రీకరా! స్థిర వరేణ్యుని ధీవిగ శ్రీదయాళి నో ,
    రా కకై కరుణ గాంచునగాశ్రయ క్ష్మానునేలుచున్,
    నా కవీ! నర మనంబున నంటున జ్ఞావిధాన! భో !
    తా కనన్ తరమ ధాత్రిని తత్కళ! త్రా విభావ! ధీ!
6. సీస గర్భస్థ ద్రుత విలంబితము:-
    స్థిర వరేణ్యుని ధీవిగ శ్రీదయా  ,
    కరుణ గాంచునగాశ్రయ క్ష్మానునే  ,
    నర మనంబున నంటున జ్ఞావిధా  !
    తరమ ధాత్రిని తత్కళ! త్రా విభా !
7. సీస గర్భస్థ తే.గీ:-
    స్థిర వరేణ్యుని ధీవిగ శ్రీదయాళి నో ,
    కరుణ గాంచునగాశ్రయ క్ష్మానునేలుచున్,
    నర మనంబున నంటున జ్ఞావిధాన! భో !
    తరమ ధాత్రిని తత్కళ! త్రా విభావ! ధీ!
8. సీస గర్భస్థ ద్వివిధ కంద ద్వయము:-
క.1a.జన శ్రీకరా! స్థిర వరే
    ణ్యుని ధీవిగ శ్రీదయాళి నో ,క్రతు వన రా
    గణనా కవీ! నర మనం
    బున నంటున జ్ఞావిధాన! భో ! తత వినుతా! ౧.
క.1b. గణనా కవీ! నర మనం
    బున నంటున జ్ఞావిధాన! భో ! తత వినుతా!
    జన శ్రీకరా! స్థిర వరే
    ణ్యుని ధీవిగ శ్రీదయాళి నో ,క్రతు వన రా! ౨.
క. 2a. వన రా కకై కరుణ గాం
    చునగాశ్రయ క్ష్మానునేలుచున్,నత గణనా !
    వినుతా కనన్ తరమ ధా
    త్రిని తత్కళ! త్రా విభావ! ధీ! శ్రిత జన శ్రీ! ౩.
క. 2b. వినుతా కనన్ తరమ ధా
    త్రిని తత్కళ! త్రా విభావ! ధీ! శ్రిత జన శ్రీ
    వన రా కకై కరుణ గాం
    చునగాశ్రయ క్ష్మానునేలుచున్,నత గణనా! ౪.
9. చతురంగ గతి బంధ కందము:- (కలతల - నెఱుగని - బులుసును - కనవలె)
    కవన విజయ ఘనుఁడ ! కళ క
    న వలె కవుల కవితన. సుగుణత, లయల, కదన్!
    కవి నెదఁ గను సుకవి కఱు
    కని  వలువల నిగ నిగ లుబుకు నిధి నిడి నిలుపున్. ౫.
     క    వ   న    వి   జ  య   ఘ    నుఁ
     డ !    ళ     క    న  వ     లె     క
     వు     క     వి   త  .    సు    గు
     ణ   త   ల   య ల,        ద     న్
     క    వి   నె    దఁ   గ  ను    సు    క
     వి   క    ఱు  క     ని  వ      లు    వ
     ల   ని   గ    ని    గ   లు    బు   కు
     ని   ధి    ని    డి    ని   లు    పు   న్
10.చతురంగ గతి బంధ ఆటవెలది:- (కలతల - నెఱుగని - బులుసును - కనవలె)
    కవన విజయ ఘనుఁడ ! కళ కన వలె కవు  
    ల కవితన. సుగుణత, లయల, కద ను!
    కవి నెదఁ గను సుకవి కఱుకని  వలువల    
    నిగనిగ లుబుకు నిధి నిడి నిలుపును .
     క    వ   న    వి   జ  య   ఘ   నుఁ
     డ !    ళ     క    న  వ     లె     క
     వు     క     వి   త  .    సు   గు
     ణ   త   ల   య ల,        ద    ను
     క    వి   నె    దఁ   గ  ను    సు    క
     వి    క   ఱు   క    ని  వ      లు    వ
     ల    ని   గ     ని   గ  లు    బు   కు
     ని    ధి    ని    డి    ని  లు    పు   ను
జైహింద్.
Print this post

5 comments:

మిస్సన్న చెప్పారు...

ఆర్యా! అత్యద్భుతం! అభినందన మందార మాల.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

వివిధ చందస్సులతో గర్భ కవిత్వాన్ని పద్యాలుగా మలచిన శ్రీ చింతా వారు శ్లాఘ నీయులు. ఎంత అవలీలగా వ్రాసారో తెలియదు గానీ ఛాలా ఆనందం గా ఉంది . కాక పొతే నాబోటి ధానికి చదివి ఆకళింపు చేసు కోవడానికి ఎంత కాలం పడుతుందో మరి ? అసలు చందస్సులో ఇన్ని వింతలు ఇప్పుడే తెలుసుకో గలగడం నా అదృష్టం. ధన్య వాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మిత్రులు సోమార్క ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించారు.
Arka Somayaji arkasomayaji@gmail.com
5:05 సా

మీ సీస పద్యం అద్భుతం !మహాద్భుతం.!నాన్యతోదర్శనీయం.ఇటీవలి కాలంలో ఇంతటి అపూర్వ ప్రయోగాలు చేసేవారు అరుదు మహాశయా!నిజంగా పరమాద్భుతం.

కథా మంజరి చెప్పారు...

చాలా చాలా అద్భుతంగా ఉంది.కవివర్యా, మీకు నా శుభాభినందనలు.

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణా రావు గారూ నమస్సులు. మీ ప్రతిభ అద్భుతము. గర్భ కవితలు చాలా బాగున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.