గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జూన్ 2012, సోమవారం

తులసీ మాహాత్మ్యమ్. - భాస్కరానందనాథ.

జైశ్రీరామ్.
సాహితీ ప్రియ మిత్రులారా ! ముఖే ముఖే సరస్వతీ అన్నారు పెద్దలు. అది అక్షర సత్యము. యావత్ హైందవ జాతీ ఎంతో భక్తి భావంతో దైవంగా ఆరాధించే తులసి ప్ర్ర్శస్త్యమును గూర్చి ప్రతీ ఒక్కరికీ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. పూజ్య భాస్కరానందనాథ గారు తులసి వైశిష్ట్యాన్ని వివరించి యున్నారు. అది మీరూ చదివి ప్రకృతిలో గల నగ్న సత్యాన్ని పదిమందికీ తెలియజేయండి ప్రయోజన బాహుళ్యాన్ని సమకూర్చండి.  ఇక చదవండి.
ఓం బృందా ! బృందావనీ విశ్వ పూజితా ! విశ్వ పావనా ! 
పుష్పసారానందినీ చ ! తులసీ కృష్ణ జీవనీ !
ఈ తులసీ దేవి నామములు స్మరిస్తేనే చాలు జీవన్ముక్తి కలుగుతుందనిఅశ్వమేధ యజ్ఞ ఫలం లభిస్తుందని దేవిభాగవతం చెపుతోంది. తులసీ దేవి గురించి చాలా విసృతమైన వర్ణన అందులో నారద మహర్షి చెప్పారు.తులసి మొక్క క్షీర సాగరమధనంలో కామధేనువు,కల్పతరువులుఅమృతంతో బాటు ఉద్భవించిందని పద్మ పురాణంలో ఉంది. ఇంత విశిష్టమైన తులసి ఎవరుఒక మొక్కకి ప్రపంచమంతటా పవిత్రంగా భావించే శక్తి ఎలావచ్చింది అని ఆశ్చ్ర్యం వేస్తుంది. ఇంటంటా ఉంటూ,అనుదినం అర్చించబడుతూమూలికగా ప్రశిద్ధిగాంచి,మౌలిక దేవతగా అపురూప దివ్యశక్తిగా కీర్తించబడే తులసీ దేవి అసలు ఎవరుఅనే ప్రశ్న ఉదయిస్తోంది.
తులసి ని స్త్రీ పురుషులు,బాలురువృద్ధులు ఎవరైనాపూజిస్తారు.దివ్య మహద్భుత రామ గాధను "రామాయణం" గా అందించిన మహర్షుల్లో "తులసీ దాసు" మహన్వితులు. దీన్ని బట్టి తులసీ అర్చన అనేక కాలాల్లోంచి వస్తోందనీ తెలుస్తోంది. తులసి అసలు "జలంధరుడు" అనే రాక్షసుని భార్య అని ఆమె పాతివ్రత్య మహిమతోనూఅతను తనబలంతోనూ శక్తివంతుడై అందరిని క్షోభింపచేశేవాడుట. ఇప్పటికి పంజాబ్ లో "జలంధర్" ఈయనపేరుమీదే వచ్చింది.దీన్నే "జాలంధర పీఠం" అని అష్టాదశ శక్తిపీఠముల్లో ఒకటిగా కొలుస్తారు (ఇది సిక్కు మతపుణ్యక్షేత్రమైన అమృతసర్ కి కూడా దగ్గరగా ఉంది).
కాత్యాయనీ చోఢ్యాణె కామాఖ్యా కామరూపకే పూర్ణేశ్వరీ పూర్ణగిరౌ చండి జలంధరే స్మృతా (కాళీ పురాణం)
అతన్ని క్షీణింపచేయడానికి సాక్షాత్తూ శ్రీ కృష్ణుడే జలంధర రూపంలో వచ్చి తులసితో ఉన్నాడని అందువల్ల ఆమె కోపించి శ్రీ కృష్ణుణ్ణే శపించిందని ఆవిధముగా అనేక అవతర విశేషాలు సంభవించాయని చెపుతారు. ఇక్కడ గోప్యమైన సూచన యేదో ఉందనిపిస్తుంది. జలమును ధరించిన వాడుజలంధరుడు, "తుల" కు కారణమైనది తులసి. తుల్ అనే ధాతువుకు సంస్కృతార్ధం "పైకి లేపునదిఉచ్ఛ స్థితికి తీసుకు వెళ్ళేది" అని అర్ధం వస్తోంది. ఈ కధని సూక్ష్మ దృష్టితో పండితులు అర్ధం చేసుకో వలసి ఉంది. ఏది ఏమైన కార్తీక మాసం లోశుక్ల పక్షంలో ద్వాదశి నాడు విష్ణువుకు,తులసికి కల్యాణం జరుపుకుంటారు. ఇకసాలగ్రామ సాధన ఒక మహాశాస్త్రం. తులసిని సాలగ్రామ శిలలని కలిపి అర్చిస్తారు. తంత్రం (ఉడ్డీశయక్షిణి,రుద్రయామళ) లో తులసీ యక్షిణి అనే దేవతారధన కూడా ఉంది. 
శ్లోకం:
తులసి మూల మారూఢో జపేదేకాగ్రమానసః 
అకస్మాద్రాజ్యమాప్నోతి నాన్యధాశంకరోదితం.
తులసిచెట్టు మొదట కూర్చుండి ఏకాగ్రచిత్తుడై నిశీధి సమయమున విడవకుండా ప్రతినిత్యం రోజు ఐదు వేలు చొప్పున 40 రోజులు జపము చేసిన తులసి (యక్షిణి) అనుగ్రహము కలుగును. విజయమును ప్రసాదించును. 
మంత్ర సిద్ధికి మౌలికంగా మూడు ముఖ్యమని మంత్ర శాస్త్రముసనాతన ఆయుర్వేదము చెపుతున్నాయి. అవి మణిమంత్రముఔషధము. మణి అనేది జాతి రత్నము. మంత్రము దేవతా శక్తి యుతము. ఔషధములు మూలికలతో ఆరోగ్యాన్నే కాదు మానవాతీత తేజస్సుని కూడా ఇస్తారని వేల సంవత్సరాలుగా ప్రపంచమంతా నమ్మారు. రక రకాల మతాలుమతల్లో కూడా వివిధమైన నమ్మకాలూ ఉన్నా కూడా ఈ అన్వేషణ నిలచిపోయింది - ఏ మొక్కలో ఏ శక్తి ఉంది అనేది !
"సీక్రెట్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్" అన్న గ్రంధాన్ని చదివితేమహాశ్చర్యంగా ఉంటుంది. మనం పెంచే మొక్క మనతో మనో సంకేతాలని అందుకుంటుందని అందులో వైజ్ఞానికంగా ఎన్నో విషయాలు చెప్పారు. మనంఆనాందంగా ఉన్నామోబాధగా ఉన్నామో కూడా మొక్కలకిచెట్లకు తెలుస్తుందిట. అసలు ప్రపంచానికి మొక్కల్లో ప్రాణం ఉందని చెప్పి నిరూపించినది సర్ జగదీష్ చంద్ర బోస్ మన భారతీయులే! 
బుద్ధుడికి జ్ఞానోదయం రావి చెట్టుకింద అయ్యిందిట. అందుకే దాన్ని "మహా బోధి" అన్నారు. అంతే కాదు వాటి ప్రతీ ఆకుని అతి భద్రం గా దాస్తారు. "ఫికస్ రెలిజియోసా" అని రావిని లాటిన్ లో పిలుస్తారు. ఆ చెట్లమీద బ్రహ్మ రాక్షసులుంటారని కధల్లో చెపితేవట యక్షిణి లాంటి శక్తులుంటాయని కొందరు నమ్ముతారు. కొన్ని రాగాలకి మందార మొక్కలు త్వరగా పెరుగుతాయిట. మొక్కల్లో ప్రాణం దివ్యత్వం ఎంత ఉంటాయంటే "ద్విజవల్లి" అనే ఒక ఓషధి మొక్క గురించి వేదకాలం నించి ఇప్పటికి మంత్రవేత్తలు వెతుకుతూనే ఉన్నారు. "అమృతవల్లి" అనికూడ పిలిచే ఈ ఓషధి ఒక ఆకు తింటే ఒక రోజంతా ఆకలి ఉండదని కొందరు మహాత్ములంటారు. ఇది రోజుకో ఆకు వచ్చి పౌర్ణమి కల్లా 15 ఆకులు వస్తాయి చంద్రకళతో బాటు. అందుకే దాన్ని "సోమలత" అని కూడా చెప్పారు. అధర్వణ వేదం కూడా ఇది ఉందనే చెపుతుంది. మనుషులు చిరంజీవులు కావడానికి కావల్సిన "కాయకల్ప చికిత్స" కి ఈ సోమలత ముఖ్యమైనదిట. ఇది చూసిన వాళ్ళనెవరని మనమెవరం చూడలేదు ఇంకా!!
ఒక్కో దేవతకి ఒక్కో మూలిక అంటే ఇష్టంట. బిల్వపత్రాలుశివుడికి,మందారాలు కాళికిగులాబీలు చండికి,ఔదుంబరం దత్తాత్రేయులకిఇలా చెప్పుకుంటూ పోతే అనేక వృక్షాల విశిష్టతలు వాటి పురాణ ప్రమాణాలు చెప్పొచ్చు. 
పూర్ణావతారములలో ఒక విశిష్ట గురు తత్వం ఉన్న అవతారం గీతాకారుడైన శ్రీ కృష్ణభగవానుణ్ణి సైతం సరితూగ గలిగిన "పవిత్రత" తులసికి ఉందని పురాణాల్లో చెప్పారు. సచ్చిదానంద రూపుడైన గోవిందునితో "తుల"తూగ గల మొక్కకనుక "తులసి" అన్నారమే తెలియదు!
భారతదేశం అంతా "తులసి" ని పవిత్రంగా ఇంటిలో "తులసికోట" పెట్టుకుని మరీ పూజిస్తారు. తులసి ఆకులు వేసిన నీళ్ళని దేవాలయాల్లో తీర్ధంగా ఇస్తారు. విష్ణువుకి అత్యంత ప్రియమైన తులసిమాలని పర్వదినాల్లోను,అర్చనల్లోనూ వేస్తారు. కృష్ణునికి తులసి ఉన్న అవినాభావ సంబంధం దివ్యమైనదిగా కొనియాడతారు. ఆ తులసియే రాధగా జన్మించినట్టు కూడా పురాణాల్లో ఉందిట. జీవన్ముక్తి మూలమైన తులసి తీర్ధాన్ని అంత్యకాలంలో జీవునికి ఇవ్వడం తులసి ఆధ్యాత్మిక మహత్మ్యాన్ని తెలియజేస్తుంది.
తులసి దళాలు అనిర్వచనీయ దివ్యశక్తి కలిగున్నాయనిమంత్రశాస్త్రం,తంత్రం కూడా ఘంటాపధం గా చెపుతున్నాయి. అసలు ఒక్క తులసిదళంతో ఎంత పెద్దవైన దుష్ట ప్రయోగాలని,క్షుద్రశక్తులని,చేతబళ్ళని,బాణామతి లాంటి వాటిని ఒక్క తులసిదళంతో ఎదుర్కో వచ్చునని వేదవిదులు చెపుతున్నారు.
ఇక విష్ణు మంత్ర సాధనల్లో తులసి మాలని వాడమని మేరు తంత్రంమంత్రమహో దధిమంత్రమహార్ణవం అన్నిటా చెప్పారు. గాయత్రి స్వరూపాల్లో "తులసి" ఒకటని గాయత్రి పరివార్ వారి దివ్య రచనల్లో కూడా అన్నారు. 
ఇస్కాన్ కు చెందిన అనేక పాశ్చాత్యులు కూడా తులసిమాలలు ధరించడం ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక థాయ్,మాలేషియన్ వంటల్లోనూ,ఇటాలియన్ వంటల్లోనూ "బేసిల్" తులసి కుటుంబానికి చెందిన మొక్కగా శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఆశ్చర్యమేమంటేప్రపంచమంతటా "బేసిల్" కి పవిత్రమైన మూలికగా పేరుంది. ఏసుప్రభువు సమాధిపై పెరిగిన మొక్క తులసి అని కొందరు చరిత్రకారులు చెపుతున్నారు. "బేసిల్" అనే పేరు రూపాంతరంగా "ఇసాబెల్" అని పేరు పెట్టుకుంటారుట పాశ్చాత్యులు. 
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవస్థానం లో లక్ష్మినరసింహ స్వరూపంగా తులసినే అర్చిస్తారు. దేవీ భాగవతంలో తులసీ మంత్రం ఈ విధంగా ఎల్లరకు సత్ఫలితములకై చెప్పవచ్చును. ఇది బుధవారము నాడుజపించినచో జ్ఞానము,ఆరోగ్యము అన్నిటిని మించి ఆనందము కలుగుతాయి. 
...........ఈ మంత్రాన్ని తులసి మాలతో జపం చేయవచ్చును. తులసి మొక్కను పూజించిజలంతో అర్చించి,ప్రదక్షిణగావించి ఈ మంత్రం చెయ్యవచ్చును. 
గోవాలోని శాంత దుర్గదేవాలయం బయట ఉన్న తులసి మొక్క శక్తివంతమైనదిగా కీర్తిస్తారు. బృందావనము లో తులసికున్న ప్రాముఖ్యత ఎంతో ఎక్కువ. ఆమె స్వయంగా రాధారూపమే. గోవర్ధనగిరిని తులసి ఆకులతో పూజిస్తారు. అక్కడ ప్రతి మొక్కకుంజ్ అన్నీ మహాత్ముల స్వరూపమే అని ప్రేమగా ఆరాధిస్తారు. 
అందరికి అభినందనలు అందిస్తూఅవ్యక్త అగోచర ,  అతీంద్రియ దివ్య తత్వం మనందరికి అవగాన కావాలనిఅన్నిటికి కన్నా అపురూపమైన ప్రేమకరుణమానవతా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తునాను.
ఓం నమో తులసి మాతాయై నమః
మీ
భాస్కరానందనాథ.
చూచారు కదా భాస్కరానందనాథ గారి అభిప్రాయం? ఇక మీరుగ్రహించిన మంచి విషయాన్ని పదిమందికీ పంచండి. నమస్తే.
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

తులసి కుజ విశేషములను
సలలితగతి తెలిపితీవు సహృదయ సుధీ
యలరిన దాంధ్రామృతమును
కలితగుణా రామకృష్ణ కవివర జేజే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తులసి మాత గురించి మంచి విషయాలను వివరిం చారు. ఇంటింటా ప్రతి ఇంటా ఉండ వలసిన చెట్టు. అందరూ పూజించ వలసిన ప్రత్యక్ష దైవం . ధన్య వాదములు.
ఆశీర్వ దించి అక్క .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.