గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జనవరి 2012, మంగళవారం

వైరస్సాసురుఁడు నా కంప్యూటర్నావహించి చాలా యిబ్బంది పెట్టాఁడు

వైరస్సాసురుఁడెట్లు వచ్చి పడెనో!  వర్ధిల్లగా చొచ్చి,  శ్రీ
గౌరీపుత్ర సమాన ధీరుఁడగు నా కంప్యూటరు న్బట్టె. నే
చేరం జేరిన గాని దుఃఖ మతియై చీకాకు పెట్టేటటుల్
మారామున్ పొనరింప చేసె. సుకవుల్ మన్నింపుడీ సత్కృపన్.
మీ ముందుకు రానందుల
కేమని భావించిరొ నను నీ దురవస్తన్
బ్రేమగ నాప్రియ శిష్యుఁడు
నీమంబుగ తొలగఁ జేసె నేర్పున దీనిన్.
నేటికి పది దినములు. గ్రహ
పాటున మిము కలువనైతి. పాఠకులారా!
దీటైన కవితలున్నను
చాటుగ, నవి వెలికి తీసి చదివింతునికన్. 
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

5 comments:

కథా మంజరి చెప్పారు...

అయిందా ? అయ్య గారి పని ! వైరస్సాసురు డంటే మజాకాయా నాయనా ! అందరం వాడితో పడే వాళ్ళమే కదా.

వైరస్ రక్కసునితో నీ పాట్లు కూడా ఎంత చక్కని పద్యాలలో రాసేవోయీ మిత్రమా !

Disp Name చెప్పారు...

అసురుడు వచ్చి
అమృతాన్ని బయటకు తీసాడండీ మాష్టారు
మీ వ్రాతలలో !

జిలేబి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

జోగారావు మిత్రమా! పగవారికి కూడా వైరస్సాసురుని బాధ కలుగకుండుగాక అని భావిస్తున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

తీపి మాటలతో సార్ధక నామ ధేయులైన జిలేబీ గారూ! మీ వఅనా అమత్కృతికి ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

వైరస్సు యనెడి రక్కసి
ప్రేరితము గమది నిమ్రింగు ప్రేయసి కన్నన్ !
ప్రారంభిం చగనటునిటు
ప్రారబ్ధము తొంగి చూచి ప్రళయము దెచ్చున్ !

క్షమిం చాలి గణ దోషాలు ఉండ వచ్చును . కానీ సరదాకి .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.