SCHOOL అనే పదానికి తెలుగులో పాఠ శాల అని అర్థం కదండీ.
ప్రాచీన కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉండేది.
ఆ కాలంలో అక్కడ ప్రతీ పౌరుడూ గురు కుల విద్యను అభ్యసించేవాఁడు. అతడు రాజ కుమారుడైనా సామాన్యపౌరుని కొడుకైనా సరే ఆ గురు కులంలోనే విద్యాభ్యాసం ఒకే విధంగా చేయాలి. జీవన విధానానికి అవసరమైన అన్ని విద్యలూ అక్కడ నేర్పే వారు.
విద్యాభ్యాసం పూర్తయే సరికి పరిపూర్ణమైన వ్యక్తిత్వం పెంపొందించుకొని నిజమైన పౌరుడుగా సమాజిక జీవనం గడపడానికి వచ్చేవాడు.
కాలం మారింది.
పద్ధతులు కూడా వాటంతట అవే మారక తప్పలేదు.
ఐతే ఎప్పుడూ విద్య "ప్రణాళికా బద్ధంగానే" నేర్పాలనే నియమ నిబంధనలు ఉండక పోలేదు.
SCHOOL లో విద్యాభ్యాసం పూర్తి అయే సరికి ఆ విద్యార్థి పరిపూర్ణమైన వ్యక్తిగా తయారవాలనే ఆనాడు SCHOOL అనే పదం చాలా చక్కని ఆలోచనతో ప్రవేశపెట్టారు.
S > సేక్రిఫైజేషన్ = త్యాగ బుద్ధి.
C > కేరక్టర్ = సత్శీలత.
H > హానెష్టీ = హుందాతనము.
O > ఆర్గనైజేషన్ = కార్య నిర్వహణ సామర్ధ్యము.
O > ఒబీడియన్స్ = అణకువ తనము.
L > లీడర్షిప్ = నాయక్త్వ లక్షణము.
స్కూల్ ఎడ్యుకేషన్ (పాఠశాల విద్య ) పూర్తి అయే సరికి ప్రతీ విద్యార్థిలోను పైన చెప్పిన గుణాలు పరిపూర్ణంగా కలగాలి.
అలా చేయ గలిగే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలి.
ప్రస్తుతం అలాగుందంటారా?
అలాగ ఉండి ఉంటే ఈనాడు యువతలో అనైతిక ప్రవృత్తి బీజాలు చేరగలిగుండేవంటారా?
తప్పుడు పనులకు పాల్పడే అవకాశం ఉండేదంటారా?
ఇన్నిటికీ కారణం స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా సంప్రప్తింప వలసిన సద్గుణాలు సంప్రాప్తింపక పోవడమే అని అనుకోవడం తప్పంటారా?
ఎక్కడుంది లోపం?
పరిష్కార మార్గం ఏమిటి?
మీరూ ఆలోచించి మీ అమూల్యమైన అభిప్రాయం వ్రాయండి.
నమస్తే.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post
ప్రతాపరుద్రుండు వీరోచిత వృత్తాంతం Kakatiya Mahasamrajyam - 2 I Prataparudra
I Rise Rule and Fall
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
10 comments:
అన్ని విలువలు ఇప్పటివాల్లకు అవసరంగా కనిపిమ్చటం లేదండి . మార్కులుచాలు. ఎలావచ్చినా సరే.
జీవన విలువలు మారి పోతున్న దశలో ఇలాంటి ఉదాత్తమైన ఆశయాల సాధన ఎండ మావిగా మిగిలి పోతున్నది కదండీ.
గొప్పగా చెప్పారండి బాబు... నా చిన్నపుడు ఒకటో తరగతి పుస్తకం తీయగానే "మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని పద్యాలుంటాయేమో, దానికి అర్ధం చెబుదామని మా అమ్మాయి దగ్గర పుస్తకం తీసుకుని చూసాను... భూతద్దం పెట్టి వెతికినా దొరకలేదు... ఇంక విద్యలో విలువలకి స్తానం ఎక్కడ... ఆరో తరగతి నుంచే ఐ.ఐ.టి. ఫౌండేషన్ కోర్సులకి "శిక్ష"ణ ఇస్తుంటే ఇంకా సచ్చీలత గురించి మాట్లాడ్డం.. మనదే తెలివి తక్కువ తనం అవుతుందేమో... ఇప్పుడు గురువులంతా కార్పోరేట్ ఉద్యోగులాయే... పనిచేస్తున్నవి కార్పోరేట్ సంస్తలాయే....
స్కూలు అన్న పదానికి చక్కని విశ్లేషణ చెప్పారు. అసలీ రోజుల్లో పెద్దా చిన్నా మంచీ చెడూ ప్రేమా అభిమానం ఇలాంటి పదాలు కనబడు తున్నాయా ? అనిపిస్తుంది. ఇక గురువులు విధ్యార్ధులు, తల్లి దండ్రులు అనుబంధాలు ప్చ్ ! రాను రాను అన్నీ మరీచికలె
ఇప్పుడూ స్కూల్ అనే పదం లో మీరు తెలిపినవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇదివరకు చదువు, తెలివి తేటల కోసం చదివే వారు. ఇప్పుడు డబ్బు సంపాయించే తెలివి తేటల కోసం చదవాల్సోస్తోంది. అందుకని మీరు స్కూల్ పదం లో చెప్పినవన్నీ దానికి అనుగుణంగా సవరణలు చేశారు. ప్రస్తుతం స్కూల్ లో నేర్పుతున్న పరిజ్ఞానం (ప్రపంచమంతా), ఇంతవరకూ తెలిసిన విషయాల నుపయోగించి డబ్బు సంపాయించి సుఖంగా ఉండగలగటం ఎలా అని.
రేపు కొత్తవి ఏమి కావాల్సోస్తయ్యి అని ఊహించి ఆ పనులు చెయ్యటానికి పూనుకునే వారు స్కూల్ వదిలి ఆపని చేస్తున్నారు. ఉదా: ఫేస్ బుక్, యు ట్యూబ్, మైక్రో సాఫ్ట్, ఆపిల్, కనుగొని చేసినవాళ్ళు, ఇంకా ఎందఱో కొత్త వాటిని కనుగొనాలని తపించే వాళ్ళూ.
దుర్గేశ్వర రావుగారూ! ఎలా వచ్చినా సరే మార్కులు చాలు ఇప్పటి వారికి అన్న మీ మాట్లలో ఎంత ఆవేదన కనిపిస్తోంది! నిజమేనండి. ఇలాంటి విద్య నేర్పిన దాని పర్యవసానం ఏమిటో ప్రస్తుత పరిస్థితులే తెలియ జేస్తున్నాయి.
మీ అభిప్రాయాన్ని తెలియ జేసినందుకు ధన్యవాదాలండి.
జోగారావు గారూ! మీరు చెప్పింది చాలా యదార్థం.
ధన్యవాదాలు.
జగదీష్ జీ! మీ మాట చాలా యదార్థం. పిల్లకు మన బడులలో ఇచ్చేది శిక్షణ కాదు. అది భవిష్యత్తుకు శిక్షే.మీ స్పందనకు ధన్యవాదాలు.
రాజేశ్వరి అక్కా!నిజమే. మీరు చెప్పిన సుగుణాలు ఇక మరీచికలే. మీ అమూల్యాభిప్రాయం వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు.
అయ్యా! యల్లెస్ రావు గారూ! మీరు చెప్పినవన్నీ చాలా యదార్థం. ఐతే తాళము వేసితిని కాని గొళ్ళెము మరచితిని అన్నట్టు మానవత్వ విలువలు మానవతా సంబంధాలు మృగ్యమైపోతున్న మాట నేటి స్థితిగతులే చెప్పకనే చెపుతున్నాయి.మీ స్పందనకు ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.