శ్లోll
యుక్తి యుక్త ముపాదేయం వచనం బాలకాదపి.
అన్యత్ తృణమివ త్యాజ్యం అప్యుక్తం పద్మ యోనినా.
ఆ.వెll
యుక్తి యుక్తమైన యుద్బోధ బాలుని
వల్ల నైన వినగ చెల్లునయ్య.
అట్టిదవని మాట నా బ్రహ్మ చెప్పినా
వినగ రాదు, నిజము, విజ్ఞులెపుడు.
భావము:-
యుక్తి యుక్తముగా చెప్పిన మాటనైతే బాలుని నుంచి కూడా గ్రహింప వచ్చును. అదే పండితుఁడు చెప్పిన విధగా స్వీకరింప వలెను. చెడు మాటలు బ్రహ్మ చెప్పిననూ త్రోసిపుచ్చ వలెను.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.