గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2010, శుక్రవారం

ఆంధ్రామృతం అభిమాలందరికీ 2011ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు.

ప్రేమామృత మూర్తులారా! 2011 ఆంగ్ల వత్సరాది సందర్భంగా  ఆంధ్రామృతం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియ జేస్తోంది. 
అనంత కాలములో నిరంతర సంచార జీవులమైన మనము, సృష్టికి మూల మైన ఆ పరమాత్మను సేవించే సమయం చిక్కడం దుర్లభం ఔతోదికదండీ.
అందుకే మనం చేసే ప్రతీ పనిలోను ఆ పరమాత్మను సేవిస్తున్నట్టుగా భావిస్తూ చేస్తే అది నిజమైన పరమాత్మ సేవే ఔతుంది కదండీ. 
అందుకే వచన రూపంలో ఆ పరమాత్మను ప్రార్థించే విధానం మీ ముందుంచుతున్నాను. 
ఇందుకు సంబంధించిన మూలాన్ని, 
దానికి నేను చేసిన పద్యానువాదాన్ని సమయం చిక్కినప్పుడు మీ ముందుంచగలను.
శివ మానస పూజ
जगतः पितरौ वंदॆ पार्बती परमॆश्वरौ
రత్నములు పొదగ బడిన సింహాసనము, 
చల్లని తీర్థముతో స్నానము, 
పట్టు వస్త్రము, 
అనేక విధనులైన రత్నములు పొదగ బడిన దివ్య ఆభరణములు, 
కస్తూరి, చందనము, 
విరజాజి, సంపంగి, మారేడు మొదలగు పుష్పములతో చేయబడిన పూమాల, 
ధూపము, దీపము, 
మొదలగునవి నా హృదయమునందు (సం)కల్పించి యుంటిని. 
ఓ దేవాది దేవా! స్వీకరింపుము. 
నవరత్న శకల విరచిత సౌవర్ణ పాత్రమున నేయి, 
పరమాన్నము, 
పాలు, పెరుగుతో కూడిన పంచ భక్ష్యములు 
అరటి పండ్లు, చక్కెర పానకము, 
శాకా నామ యుతమైన రుచికరమైన జలము, 
కప్పురపు విడెము, 
నా మనసు నందు భక్తితో సిద్ధము చేసితిని. ఓ పరమేశ్వరా! స్వీకరింపుము. 
ఛత్ర, చామర యుగము. 
వీవన,....... వీణా భేరి, 
మృదంగకోహల, కలా గీతము, నృత్యము, 
అదే విధముగా సాష్టాంగ ప్రణామము 
అనేక విధములగు ప్రస్తుతులు, 
ఓ విభూ!  ఇట్టి వన్నియు నా చేత సంకల్పుము ద్వారా నీ కొఱకు సమర్పింపఁ బడినవి. 
ఓ పరమాత్మా!  ఈ పూజలను స్వీకరింపుము.
ఓ శంభో! నా ఆత్మయే నీవు. 
నాయొక్క బుద్ధియే ఆ జగన్మాత ఐన గిరిజ. 
ప్రాణి కోటియే సహ చర గణము. 
నాశరీరమే ఆలయము. 
సంసారిక కార్య కలాపములే నీ పూజ. 
నిద్దురపోవుటయే సమాధి. 
పాదములతో తిరిగేదంతయూ నీ కొఱకు చేయు ప్రదక్షిణ. 
నేను పలికెడి పలుకు లన్నియు నీ కొఱకు చేయు స్తోత్రములే. 
ఏ పనులైతే నేను చేయు చుంటినో అవి సమస్తము నీ ఆరాధనయే సుమా! 
కరుణా సాగరుడవైన ఓ పరమేశ్వరా! 
కాళ్ళతో గాని, 
చేతులతో గాని, 
శరీరముతో గాని, 
కర్మలతో గాని, 
చెవులతో కాని, 
కన్నులతో గాని, 
మనసుతో కాని, 
తెలిసి కాని, 
తెలియక కాని 
చేసినవైన పనులలో గల అపరాధములు క్షమించుము. నీకు జయము.
लॊकाः समस्ताः सुखिनॊ भवंतु.
जै श्रीरं.
जैहिंद्. Print this post

8 comments:

Unknown చెప్పారు...

ఆప్తుల యోగక్షేమాలే ఆనందదాయకం ఆత్మీయులను తలచుకొనడం పండుగనాడు విధాయకం అందుకే ఈ పర్వదిన శుభ సమయంలో ఆయురారోగ్యభాగ్యాలు పెరగాలీ ఇతొధికం.
నూతన సంవత్సర శుభాకాంక్షలతొ ధరణీ రాయ్ చౌదరి

Padmarpita చెప్పారు...

నూతన సంవత్సర శుభాకాంక్షలు

SRRao చెప్పారు...

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

SRRao
శిరాకదంబం

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధరణీరాయి ప్రసిద్ధ చౌదరి! మహా ధన్యాత్ములీరీ భువిన్.
కరుణోద్భాసిత చిత్తవర్తులు సదా కల్యాణ సత్ కాములున్.
సరివారెవ్వరు లేరు మీకుననగా చక్కంగ మీ పల్కులన్
మురిపెంబున్ గురిపించినారలనఘా!పుణ్యాత్మ. కైమోడ్చెదన్.

kannaji e చెప్పారు...

చాల బాగుంది.మీకు నవ ఆంగ్ల వత్సర శుభాకాంక్షలు

http://buzzitram.blogspot.com/
http://4rfactor.blogspot.com/

మాలా కుమార్ చెప్పారు...

baagundi .

happy new year

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సరస్వతీ పుత్రులు పాండితీ స్రష్టలు మీ అందరికి నూతన సంవత్సర శుభా కాంక్షలు

మిస్సన్న చెప్పారు...

ఆర్యా శివ మానస పూజ ఆంధ్రానువాదం చాల బాగుంది. అలాగే కాళిదాసు వ్రాసిన సకలజననీ స్తవానికి తెలుగులో తాత్పర్యం మీ బ్లాగులో ఆశించా వచ్చునా? భవదీయుడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.