గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, డిసెంబర్ 2010, బుధవారం

మెలిమి బంగారం మన సంస్కృతి106.

శ్లోll
అపూజ్యా యత్ర పూజ్యంతే పూజ్యానాంచ వ్యతిక్రమః.
త్రీణి తత్ర భవిష్యంతి. దుర్భిక్షం; మరణం; భయమ్!
తే.గీll
దుష్టులకు గౌరవంబిచ్చు దుష్టులకును;
శిష్ఠిలను కాల వ్రాసెడి చెడుగులకును
మరణ దుర్భిక్ష భయములు దరికి చేరి
కాల గర్భమునందున కలుపు. నిజము.
భావము:-
ఎచ్చట అయోగ్యులు పూజింప బడుచుండిరో; పూజనీయులు అవమానము నొందుచుండిరో; అచ్చట కరువు; మరనము; భయము ఈ మూడూ తటస్థింపక మానవు.
జైశ్రీరాం.
జైహింద్. Print this post

2 comments:

కథా మంజరి చెప్పారు...

చాల దినాల తరువాత మీ అమూల్యమైన మాటలు
వినిపించారు. సంతోషం.

కథా మంజరి చెప్పారు...

టపా శీర్షిక మేలిమి అని సరి చేయండి. టైపింగు లో తప్పు దొర్లింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.