గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, డిసెంబర్ 2010, మంగళవారం

డా.గణపతి రావు కవి గారి మాలికా బంధము.

ప్రియ సాహితీ బంధువులారా! ద్విగుణీకృత ఉత్సాహంతో సాహితీ జగత్తులో మ్ందుకు దూసుకొని పోతున్న మీకు నా అభినందనలు. అనివార్య కారణాల వల్లతరచుగా మీ ముందుకు రాలేకపోయిన నన్ను మన్నించ గలరు. 
శ్రీ దేవ గుప్తాపు గణపతి రావు డాక్టరు కవిగారి మాలాబంధ నిర్మాణ నైపుణి చదివిన వారికి తప్పక అబ్బుర పరచక మానదు.
చూడండి. ఈ దిగువున శ్రీ వేంకటేశ్వరునికి వకుళ మాల లాగా పరమశివుని అలంకరించి ఒప్పిదమై యున్న ఈ మాల ఎంత అద్భుతంగా ఉందో!  
శ్రీ గణపతి రావుగారు తన వైద్య విద్యతో ప్రాణ సంకట స్థితిలోనున్న వారికి ప్రాణం నిలపడమే కాదు.సాహితీ పిపాస రుగ్మతని పోకార్ప నేర్చిన కవి భిషక్కు కూడాను అని పై పద్యం చదివితే మన కర్థమౌతోంది కదండీ!
ఇంత చక్కని మాలికనందించిన ఆ కవికి అభినందన పూర్వక ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా రోజుల తర్వాత ఇంత చక్కని పరిమళ భరితమైన మాలికా బంధంతొ అందరి మనసులను బంధించ గలిగిన మాన్యులు శ్రీ గణపతి రావు గారు మా కందరికి అందించిన సహృదయులు శ్రీ చింతా వారు అభినంద నీయులు.మీరు సరస్వతీ పుత్రులు. ధన్యులు. ఇంతటి అద్భుత మైన ఛందస్సుని చదవ గలగడం నా అదృష్టం. ఇలాగె ఇంకా ఇంకా ఆ దేవి అనుగ్రహంతొ మరిన్ని పరిమళాలను అందించాలని కోరుతు ఈ చిన్ని కలం.

రవి చెప్పారు...

చాలా రోజుల తర్వాత వచ్చిన బంధ కవిత్వ రచన - మాలిక సుగంధభరితంగా ఉందండి. భిషగ్వర్యులకు ప్రణామాలు.తాత్పర్యము కూడా తెలిపితే బావుంటుంది కదండి.

మిస్సన్న చెప్పారు...

అపురూపమైన మాలిక ఇది. గుబాళింపులు వెదజల్లుతోంది. సరస్వతీ ఉపాసకులకే ఇది సాధ్యం. అందించిన మీరుకూడా ధన్యులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.