గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జూన్ 2019, ఆదివారం

విహరణ,రస,మానస,మకరంద,రసయా,రసయుగళీ,చిత్రమివ,రసయానన,రసయాంబోజ,సోయగ,గర్భ"-భాణియా"-వృత్తము. రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి

 జైశ్రీరామ్.
విహరణ,రస,మానస,మకరంద,రసయా,రసయుగళీ,చిత్రమివ,రసయానన,రసయాంబోజ,సోయగ,గర్భ"-భాణియా"-వృత్తము.
రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-భాణియా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.య.ర.స.య.ర.స.లగ.గణములు.యతులు10,19.
ప్రాసనియమముకలదు.వృ.సం.
చిత్రమివ కవిత లల్లన్!చిత్తజాహితు మెచ్చు పెచ్చున్!శ్రీకరంబులు కూరుతన్!
మిత్ర బుధ వరులు మెప్పౌ?మెత్తనౌ సుమ సోయగంబౌ!మేకొను నున్సుర మోదమై!
క్షేత్రమున నిల్చు కీర్తిన్!చిత్తమందున మోద మేర్చున్?చేకొనందగు విస్త్రుతిన్!
ఛత్రముగ తప ఫలంబౌ!సత్తు సత్యము నిత్య మౌచున్?సాకుతం జన చిత్తముల్!
అర్ధములు:-
సత్త్=ఆపర బ్రహ్మాత్మకమైన,సత్యము=నిజము పలుకుట,నిత్యము=
నిత్యమైనది
భావము:-
చిత్రమైన కవితలు(చిత్రగర్భ కవితాదులు)అల్లుట వలన,కందర్పదమనుడు,
ఆ పరమేశ్వరుడు మిక్కిలి మెచ్చుకొనును.శుభములు చేకూరును.మిత్ర,
పండిత శ్రేష్టులు మెచ్చుకొందురు.మెత్త నైన సుమ సోగము గుబాళించును.
సురామోదము నందును.కీర్తివంతమై భూతలిని నిల్చును.మానసికాహ్లాదము చేకూర్చును.విస్తృతముగా,నాకవితలు భావి తరములు చేకొనం దగును.
అదియే శీత,వాత,ఆతప,నివృత్తి నొసగు ఛత్రముగను,కృతికర్త తఫః ఫలం
బగును.ఆపర బ్రహ్మాత్మకమైన,సత్యము నిత్యమగును.జనుల హృదయము
లకు హత్తుకొనును.
1.గర్భగత"-విహరణ"-వృత్తము"-
బృహతీఛందము.భ.న.య.గణములు.వృ.సం.127.
ప్రాసనియమముకలదు.
చిత్తమివ కవిత లల్లన్!
మిత్ర బుధ వరుల మెప్పౌ!
క్షేత్రమున నిల్చు కీర్తిన్!
ఛత్రముగ తపఫలంబౌ?
2."-రస"-వృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.
ప్రాసనియమముకలదు.
చిత్తజాహితు మెచ్చు పెచ్చున్!
మెత్తనౌ సుమ సోయగంబౌ!
చిత్తమందున మోద మేర్చున్!
సత్తు సత్యము నిత్య మౌచున్!
3."-మానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.
ప్రాసనియమముకలదు.
శ్రీకరంబులు కూరుతన్!
మేకొనున్ సుర మోదమై!
చేకొనందగు విస్తృతిన్!
సాకుతన్!జన చిత్తముల్!
4.గర్భగత"-మకరంద"-వృత్తము.
ధృతిఛందము.భ.న.య.ర.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
చిత్రమివ కవిత లల్లన్!చిత్తజాహితు మెచ్చు పెచ్చున్!
మిత్ర బుధ వరుల మెప్పౌ!మెత్తనౌ సుమ సోయగంబౌ!
క్షేత్రమున నిల్చు కీర్తిన్! చిత్తమందున మోదమేర్చున్!
ఛత్రముగ తప ఫలంబౌ!సత్తు సత్యము నిత్య మౌచున్!
5.గర్భగత"-రసయా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.
చిత్తజాహితు మెచ్చు పెచ్చున్!శ్రీకరంబులు కూరుతన్?
మెత్తనౌ సుమ సోయగంబౌ!మేకొనున్ సుర మోదమై!
చిత్తమందున మోద మేర్చున్!చేకొనందగు విస్తృతిన్!
సత్తు సత్యము నిత్య మౌచున్!సాకుతన్!జన చిత్తముల్!
6.గర్భగత"-సరయుగళీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.య.న.న.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
చిత్తజాహితు మెచ్చు పెచ్చున్!శ్రీకరంబులు కూరుతన్!చిత్రమివ కవితలల్లన్!
మెత్తనౌ!సుమ సోయగంబౌ!మే కొనుం సుర మోదమై!మిత్రబుధ వరుల మెప్పౌ!  
చిత్తమందున మోదమేర్చున్!చేకొనందగు విస్తృతిన్!క్షేత్రమున నిల్చు కీర్తిన్!
సత్తు సత్యము నిత్య మౌచున్!సాకుతం జనచిత్తముల్!ఛత్రముగ తప ఫలంబౌ?
7.గర్భగత"-చిత్రమివ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.న.న.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
శ్రీకరంబులు కూరుతన్!చిత్రమివ కవిత లల్లన్!
మేకొనుం సుర మోదమై!మిత్ర బుధ వరుల మెప్పౌ!
చేకొనందగు విస్తృతిన్!క్షేత్రమున నిల్చు కీర్తిన్?
సాకుతన్!జన చిత్తముల్!ఛత్రముగ తప ఫలంబౌ?
8.గర్భగత"-రసయానన"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.న.న.య.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
శ్రీకరంబులు కూరుతన్!చిత్రమివ కవిత లల్లన్?చిత్తజాహితు మెచ్చు పెచ్చున్!
మేకొనుం సుర మోదమై!మిత్ర బుధ వరుల మెచ్చన్!మెత్తనౌ! సుమ సోయ గంబౌ?
చేకొనందగు విస్తృతిన్!క్షేత్రమున నిల్చు కీర్తిన్!చిత్తమందున మోదమేర్చున్!
సాకుతం జన చిత్తముల్!ఛత్రముగ తప ఫలంబౌ!సత్తు సత్యము నిత్య మౌచున్?
9.గర్భగత"-రసయాంబోజ"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.భ.న.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.
చిత్త జాహితు మెచ్చు పెచ్చున్!చిత్ర మివ కవిత లల్లన్?
మెత్తనౌ!సుమ సోయగంబౌ?మిత్ర బుధ వరులు మెచ్చన్?
చిత్తమందున మోదమేర్చున్!క్షేత్రమున నిల్చు కీర్తిన్!
సత్తు సత్యము నిత్యమౌచున్?ఛత్రముగ తప ఫలంబౌ?
10,గర్భగత"-సోయగ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.భ.న.య.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమముకలదు.వృ.సం.
చిత్తజాహితు మెచ్చు పెచ్చున్!చిత్రమివ కవిత లల్లన్!శ్రీకరంబులు కూరుతన్?
మెత్తనౌ!సుమ సోయగంబౌ? మిత్ర బుధ వరులు మెచ్చన్!మేకొనుం సుర మోదమై!
చిత్తమందున మోదమేర్చున్!క్షేత్రమున నిల్చు కీర్తిన్!చేకొనందగు విస్తృతిన్?
సత్తు సత్యము నిత్యమౌచున్?ఛత్రముగ తపఫలంబౌ?సాకుతన్!జన చిత్తముల్?
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు, గర్భగత పద్యం
అద్భుతంగా ఉన్నది ,శ్రీమాన్ వల్లభవఝుల వారికి అభినందన వందనములు, అందించిన మీకు ధన్యవాద శతము .🙏🙏🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.