గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జూన్ 2019, ఆదివారం

తృణాదపి లఘుస్తూల . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. తృణాదపి లఘుస్తూల | స్తూలాదపి చ యాచక
వాయునా కిం ననీతో సౌ | మామ యం యాచేదతి.
తే.గీ. తృణము కన్నను దూదియే తేలిక కద.
యాచకుడు దూది కన్నను నరయ లఘువె.
ఎగురఁ గొట్టెడి వాయువే యెదురు పడడు
యాచనము చేయు తననని యాచకునకు.
భావము.
గడ్డి పోచ కన్నాదూది తేలిక. దానికంటే తేలిక యాచకుడు. గడ్డిపరకను దూదిని ఎగురుకొట్టు వాయువు యాచకుని జోలికి రాడు కారణము తననెక్కడ యాచించుతాడోనన్న భయముచేతనే సుమా. . యాచకుని పరిస్థితి అంత నీచం. అందువల్ల ఏ విధంగా నయినా కష్టపడి సంపాదించుకోవాలి గాని  యాచనా వృత్తికి ఒడబడ కూడదు..
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.