గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జూన్ 2019, శుక్రవారం

శబ్ద నిష్పత్తి . . . సాహితీ సంపద,

జైశ్రీరామ్.
శ్లో. ఆకాశాత్ వాయు ప్రభవః, శరీరాత్‌ సముచ్చరన్‌, వక్త్రముపైతి నాదః।
స్థానాన్తరేషు ప్రవిభజ్యమానో  వర్ణత్వమాగచ్ఛతి యః స శబ్దః॥
గీ. వాయువాకాశమునఁ బుట్టి పలుకఁబడును
దేహమందుండి, వక్త్రాన దివ్య నాద
మగుచు, స్థానములను బట్టి యగును వర్ణ
ముగను. శబ్దమందురు దాని నిగమ విదులు. 
భావము. ఆకాశమునుండి వాయువు ప్రభవించును. శరీరమునుండి ఉచ్చరింపఁబడి, ముఖముద్వారా ద్వనిరూపమున వెల్వడును. స్థానాంతరములనుండి విభజింపఁబడినవి అక్షరములుగా ఏదైతే వెలువడుచున్నవో అదియే శబ్దము. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.