జైశ్రీరామ్.
జైశ్రీమన్నారాయణఆర్యులకు శుభోదయమ్.
🕉 గం గణపతయే నమః.
అశ్వధాటి.
శ్రీపార్వతీతనయ! మాపై దయం గలిగి నీ పాదముల్ కొలువనీ.
నీ పాద సేవనము పాపాపహారణము దీపింపఁ జేయు శుభముల్.
దీపించు భక్తినిట నీ పూజ చేసినను శాపాదులే తొలఁగుఁగా.
నీపై మదిన్ నిలిపి నీ పాదముల్ కొలుతు శ్రీపాద్ద్వయా గణపతీ!
జైశ్రీమన్నారాయణ
జైహింద్.
1 comments:
నమస్కారములు
చాలా రోజుల తర్వాత మళ్ళీ అశ్వాధాటి . బాగుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.