గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, మే 2019, ఆదివారం

పరోపదేశే పాండిత్యం సర్వేషాం .. .. .. మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. "పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం నృణాం 
ధర్మే స్వయ మనుస్టానం కస్య చిత్తు మహాత్మనామ్ !
తే.గీ. పరులకుపదేశమిచ్చుట పరమ సుఖము.
తదుపదేశ ధర్మంబు తాను చేయు
టన్న కష్టంబు. కన కొందరున్నతులిల
ధర్మ బోధన మొనరించు, తాము చేయు. 
భావము:-- 
పరులకు ఉపదేశము చేయడములో అందరూ మహా పండితులే కానీ వారు ఉపదేశించిన ధర్మమును స్వయముగా తాము పాటించడము మాత్రం ఎవరో మహాను భావులు మాత్రమే చేయగలరు.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమే చెప్పడం తేలిక కానీ ఎంతమంది తమకి తాము పాటిస్తున్నా రన్నది ప్రశ్నార్ధకం. బాగుంది .మంచి సూక్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.