గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మే 2019, శుక్రవారం

పఱగు పంచాక్షరమ్ముల పక్షివరుడు . . ప్రహేళిక.

జైశ్రీరామ్.
పఱగు పంచాక్షరమ్ముల పక్షివరుడు 
వాని తలదీయ నొక కవివర్యుడగును,
వాని తలద్రు౦ప వణిజుల కవసరమగు 
అసలు పదము దెల్పు జోహారొనర్తు 
సమాధానము:- 'కపోతారాజు' తల అంటే 
మొదటి అక్షరం తీసేస్తే "పోతరాజు" (ఒక కవివర్యుడు) దాని మొదటి అక్షరం తీస్తే 
'తరాజు' (తక్కెడ)వర్తకులకుపయోగ పడేది. 
జైహింద్.
Print this post

4 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
జవాబు బహుశ " కపోతరాజు " అని నాఉద్దేస్యము

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కయ్యా! వందనాలు. మీరిచ్చినది సరయిన సమాధానమే. అభినందనలమ్మా.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

dhanya vaadamulu sOdaraa

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

dhanya vaadamulu sOdaraa

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.