గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఏప్రిల్ 2015, గురువారం

మహాకవి కాళిదాసు తెలుగు చలన చిత్రములో ......

జైశ్రీరామ్.
ఆర్యులారా! అత్యద్భుతమైన నటనతో నిజమైన జానపదుని పూర్తి స్వరూపాన్ని స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత అద్భుతంగా నటించి మన కళ్ళముందుంచారో గమనించండి.

ఈ పల్లె జీవన పాత్రను రక్తికట్టిమ్చండంలో మన నాగేశ్వర రావుగారి నటనా కుశలత ఎంతగా ఉందో అంతగానూ ఈ పాట రచనలోను, పాడడంలోను, మిగిలినవారి అభినయనంలోను మనకి కనిపిస్తుంది. అలనాటి అపురూపమైన ఈ చిత్రాన్ని ఎన్నిపర్యాలములు చూచినా, ఎంతగా చెప్పినా తనివితీరదన్న మాట సత్యదూరం కాదని మీరూ అనక మానరు.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మంచి చిత్రాన్ని అందించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.