గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఏప్రిల్ 2015, ఆదివారం

చక్కగా జరిగిన శ్రీనల్లమోతు శ్రీధర్ రిలేషన్స్ గ్రంథావిష్కరణ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! రిలేషన్స్ పుస్థక ఆవిష్కరణోత్సవ సభ. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ నందు ఎంతో వేడుజగా జరిగింది. ఈ కార్యక్రమమునకు ప్రముఖులు చాలామంది వచ్చారు. శ్రీధర్ పై తమకున్న అవ్యాజానురాగాన్ని వారు సభాముఖంగా వ్యక్తం చేశారు.
రిలేషన్స్ పుస్థక ఆవిష్కరణోత్సవ సభ.
కంప్యూటర్ ఎరా మాస పత్రిక నిర్వాహకుఁడు. సైబర్ మాష్టర్ & హీరోనల్లమోతు శ్రీధర్.
తన అనుభవ సారాన్ని లోక ప్రయోజనకరంగా రిలేషన్స్ పేరున గ్రంథస్థం చేసినందుకు ఆనందంగా ఉంది. ఈ ఆవిష్కరణ సభా వేదికపై నాకూ స్థానం కల్పించినందులకు చాలా సంతోషం కలిగింది. రిలేషన్స్ నేను పూర్తిగా చదివాను. 
దానిపై నా అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశాను.
ఆ.వె. నల్లమోతు శ్రీధరుల్లంబులోనుండి 
పొంగి పొరలి యెగసె నింగి వరకు.
పొల్లుమాటలన్న పొరపాటునైనను 
కానరావు వీని ఘనత యిదియె.
ఆర్టాఫ్ లివింగ్ శిక్షణ పొందాలనుకుంటే గురువులను వెతుక్కొంటూ ఎక్కడికో పోనక్కర లేదు. రిలేషన్స్ గ్రంథం చదువుకొంటూ, ఆత్మపరిశీలన చేసుకొంటూ, మన ప్రవర్తన మన హద్దు మీరకుండా ఉండే విధంగా సాధన చేస్తే అదే మనకు మార్గదర్శి అవుతుంది.
గ్రంథస్థమైన కొన్ని అంశములకు నా సమీక్ష.
౧. అతి వివేకము, అతి అవివేకము మేలుకాదు.
అతి కామాత్ దశగ్రీవః – అతి లోభాత్ సుయోధనః,
అతి దానాత్ హతః కర్ణః, – అతి సర్వత్ర వర్జయేత్.
౩. ఎవరైనా ఫోన్ చేస్తే మనం వారితో మాటాడే విధానం సెంటిమెంట్లనీ, ఇమోషన్లనీ మన నిష్టోరాలకు, కోపాలకు, వాడేసుకోవడం. అస్సలు బాగోటంలేదు. అసలు మనకేం కావాలో ఎవరికైనా క్లారిటీ ఉందా?
నూటికి నూరుపాళ్ళూ ఇది నిజం. 
ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః. 
తస్మాత్ తదేవ కర్తవ్యం. వచనే కాదరిద్రతా? అంటాడోమహాకవి.
౧౧. కోపతాపాదులు కలగడం వాటి ప్రతిఫలాలు చక్కగా వివరించారు..
౧౨. మితి మీరిన వ్యామోహం దుఃఖ హేతువు అని చక్కని వివరణ యిచ్చారు.
క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః 
స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశొ, బుద్ధినాశాత్ ప్రణస్యతి 
అన్నారు గీతాచార్యులు. అందుకే కామాది అరిషడ్వర్గాల్ని జయించాలన్నారు పెద్దలు.
౧౩. మన లైఫ్ ని మనమే లీడ్ చెయ్యాలి. చక్కగా చెప్పారు.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం తెలిసి నిదుర పోకుమా. అన్నారు మన శ్రీ శ్రీ గారు.
౧౪. పూర్వులు నిర్ణయించిన సిష్టమ్సుని, కష్టమ్సుని మనం లెక్క చెయ్యము అని పొజు కొడితే లెక్కల్లో లేకుండా పోయేది మనమే. 
అహా! ఎంతటి నగ్న సత్యమిది. 
౧౫. శరీరానికి ఆహారానికి మనస్సుకి గల అవినాభావ సంబంధం చక్కగా వివరించారు.
ముమ్మాటికీ ఇది నిజం. ప్రశాంత చిత్తంతో,  ఆకలి తీరే వరకూ మాత్రమే మితాహారం తీసుకోవాలి అని మన పెద్దల్లు చెప్పిన సుద్దును గుర్తు చేస్తుందీమాట.
౧౭. పరిస్థితులకు ఇమ్మోషన్లైజ్ కాకూడదని దేన్ని ఎంతవరకూ తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలని చక్కని వివరణ ఇచ్చారు.
మనం మనసును అదుపులో పెట్టుకొనేందుకు మనకు మెడిటేషనేసరైన మార్గంగా పెద్దలు చెబుతారు. 
ఉ. సత్యములెల్ల చూపితివి. చక్కని సూచనలిచ్చినాడవౌ
న్నత్యముఁ గొల్పనెంచి, వర నాయకరత్నమ! నల్లమోధు సత్
స్తుత్య కులాబ్ధి చందురుఁడ! ధన్యలు నీ తలిదండ్రు లిద్ధరన్
ముత్యము వంటి పుత్రునికి మూలములౌటను, శ్రీధరాఖ్యుఁడా!
అభినందనలతో
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్.
Print this post

1 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మన రాజేశ్వరక్కయ్య గారి ఇలా అన్నారు.


రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
నమస్కారములు
చాలా బాగుంది శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి
హృదయ పూర్వక శుభాభి నందనలు . అక్కడ ఉండి ఉంటే నేను తప్పక పుస్తకం కొని చదివి ఉండే దాన్ని ఇప్పుడు అన్నీ మిస్ అవుతునాను నా బాడ్ లక్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.