గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, డిసెంబర్ 2014, గురువారం

శ్రీకరంచ పవిత్రంచమహత్ శోక నివారణమ్. మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. శ్రీకరంచ పవిత్రంచ మహత్ శోక నివారణమ్.
లోకే వశీకరం పుంసాం, భస్మం త్రైలోక్య పావనమ్. 
గీ. శ్రీకరంబు, పవిత్రము, శోక హారి,
లోకమును పుంస జాతికి లొంగఁ జేయు,
మహిత త్రైలోక్య పావన మహిని భూతి.
భస్మధారణ పురుషుల వరలఁ జేయు.
భావము. లోకమున మంగళప్రదమైనదియు, పవిత్రమైనదియు, మిక్కుటమైన శోకములనైనను నివారించునట్టిదియు, పురుషులకు వశీకరణ శక్తిప్రదమైనదియునైన విభూతి ముల్లోకములందును పావనమైనది.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును పవిత్ర మైనదీ శుభకర మైనదీ ఐన భస్మ ధారణ గురించి మంచి శ్లోకం చెప్పారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.