జైశ్రీరామ్.
౧.ఆ. అగ్నిని, పురహితుని, యజ్ఞప్రకాశకు, - నసమ ఋత్విజుని విలసిత హోత
నఖిల ధర్మ జ్ఞాన మమరించి పోషించు - యనిలసఖునిగొలుతు ననుపమగతి.
౨.ఆ. అగ్నిపూర్వ ఋషులు నంతియె కాక యా - ధునిక ఋషుల చేత వినుతయోగ్యు
డట్టి యగ్ని యిచట నమర శక్తులనెల్ల - నమరఁజేయ వలతు యజ్ఞమునకు.
౩.గీ. దినదినంబున పుష్టినందించి వృద్ధి - నందఁజేయు విక్రాంతుల కధిక కీర్తి
కలుఁగ చేయు యశోధనములను బడయు - నగ్ని మూలాన సాధకుఁ డసదృశముగ .
౪.గీ. జయమునపజయంబను భావచయము మీరి, - సాధనా యజ్ఞ మార్గ సద్బోధ కలిగి
అన్నివైపులనుందువీ వప్రమత్త - తను నదియె యజ్ఞమనిమెత్తు రనిమిషులును.
చేయువాఁడును, మార్పులే చేరనతఁడు. - కనులకు విచిత్ర కాంతిని కలుగఁజేసి,
చెవులకు విచిత్ర నాద సచ్ఛ్రీ స్వశక్తి - కలుగఁ జేసెడి వాడును, ఘనతరమగు
వివిధ సచ్చిత్ర, ధ్వని చిత్ర నివహమనగ - పేరుఁ గన్నట్టి వాఁడగ్నిదేవుఁడిపుడు
తనకు సాటైన దేవతాతతులతోడ - వచ్చుగాత నా కడకు తా మెచ్చుగాను.
౬.గీ. చూడుమగ్ని! యంగిరుఁడా! వసుంధరపయి
తాను చేసెడి కర్మలఁ దక్కు ఫలము
తాను చేసెడి కర్మలఁ దక్కు ఫలము
భగవదర్పణ చేసెడిభక్తులకిల
నెట్టి కల్యాణములుగూర్తు వట్టివెల్ల
నెట్టి కల్యాణములుగూర్తు వట్టివెల్ల
నీవి. నీకిది తగునయ్య. నిజము నిజము.
౭.గీ. అగ్నిహోత్రుఁడ! రేబవలనితరమగు - సాధకులమైన మేము సద్బోధఁ జేసి
యోచనను చేయు కర్మలనొప్ప, వంద - నముల నింపుచు, నిన్ జేరుదుమయ! కనుమ!
౮.గీ. పృథు! ఫలాసక్తియన్ హింస విడుచునట్టి - యజ్ఞ దేదీప్యమార్గాలు ప్రజ్ఞఁ గాచు
వాఁడవును, విశ్వనియమమ్మువరలఁ జేయు - వాడవు, నిగృహీతమయిన, వరలునట్టి
క్రమ సుశిక్షణాయుతమైన తమదెయైన - సాధనశరీర గృహమున మోదమొప్ప
వరలు చున్నట్టివాఁడవు నిరుపమముగ, - వందనము సేతు కృపతోడనందుకొనుము.
౯.గీ. తండ్రివలె మమ్ము సులువుగా దరికిఁ జేర - నిమ్ము. మేము భద్రమ్ముగా యిమ్ముతోడ
నుండ మాతోడ నీవిల నుండుమయ్య. - రామకృష్ణను మన్నించి ప్రేమఁ గనుము.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.