గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జులై 2014, మంగళవారం

దుఃఖే దుఃఖాధికాన్ పశ్యేత్... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. దుఃఖే దుఃఖాధికాన్ పశ్యేత్సుఖే పశ్యేత్సుఖాదికాన్ 
ఆత్మానం సుఖదుఃఖాభ్యాం శత్రుభ్యామివ నార్పయేత్.

గీ. దుఃఖమందున నీకంటె దుఃఖితులను,
సుఖములందున నీకంటె సుఖపరులను
చూచి, సంయమనంబున సుఖము గనుము.
నిక్కమెఱుఁగుచు వాటికి చిక్కఁబోకు.
భావము. నువ్వు దుఃఖంలో ఉంటే, నీ కంటే ఎక్కువ దుఃఖం కలవాళ్ళను చూడు.సుఖంలో ఉంటే, నిన్ను సుఖంలో మించినవాళ్ళను చూడు. అంతేగానీ శత్రువులకు లొంగినట్టు సుఖ దుఃఖాలకు లొంగకు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును చిన్న గీత పెద్ద గీత లాగ సందర్భాన్ని బట్టి ఆయా గీతలతో పోల్చుకుంటే సుఖదు:ఖాల కతీతంగా హాయిగా ఉండవచ్చును ఇక్కడ తవ్విన కొలదీ ఆణి ముత్యాలు దొరుకుతూనేఉంటాయి
ఇదిఒకనిధి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.