గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జులై 2014, గురువారం

ప్రస్తావ సదృశం వాక్యం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. ప్రస్తావ సదృశం వాక్యం, స్వభావ సదృశీం క్రియాం 
ఆత్మశక్తి సమం కోపం, యో జానాతి స పండితః.

క. సమయోచిత భాషణమును, 
తమ బుద్ధికి తగిన పనిని, తమ కొలదిని క్రో
ధము నెఱిగి మెలగు వారలె 
సమవర్తులు, పండితులును, సద్గుణ వరులౌన్.
భావము. సందర్భానికి తగిన సంభాషణం, తన స్వభావానికి తగిన పని, తనశక్తికి తగిన కోపం ఏవియో బాగుగా గ్రహించినవాడే పండితుడు. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును సమయస్పూర్తి తెలివికి నిదర్శనం " జార్జి బెర్నార్ద్ షా " లాగ మంచి సూక్తి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.