గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఏప్రిల్ 2013, సోమవారం

కిరణ్ ప్రసంగంలో తళుకులీనిన బేతవోలు కవితా మాధుర్యం.

జై శ్రీరామ్.
సాహితీ సన్మిత్రులారా! తుని శాఖా గ్రంథాలయములో తుని సాహితీ సమితి వారు ఏర్పాటు చేసిన సాహితీ సభలో 30-03-2031 వ తేదీన బొద్దవరం ఉన్నత పాఠశాల ఆంధ్రోపాధ్యాయులైన శ్రీ ఆర్. శ్రీకృష్ణ కిరణ్ శ్రీ బేతవోలు గారి కవిత్వ వైశిష్యం అనే అంశముపై అద్భుతముగా ప్రసంగించారు.
కార్యక్రమ నిర్వాహకులు వక్త శ్రీ కిరణ్ ను సముచిత రీతిలో సత్కరించి, తమ అభిమానమును చాటుకున్నారు. అనేకమంది పుర ప్రముఖులు ఈ ప్రసంగము విని ముగ్ధులై తమ సంతోషమును సభాముఖముగా వ్యక్తం చేశారు. సాహితీ ప్రియుల యొక్క, విలేఖరుల యొక్క మన్ననలందుకొనిన శ్రీ కిరణ్ ను మనసారా అభినందిస్తున్నాను.

విలేఖరుల యొక్క మన్నలను అందుకొనిన శ్రీ కిరణ్ వక్త మాత్రమే కాదు అష్టావధాని కూడా అని తెలుసుకొనిన శ్రోతలు వీరి అవధానమును కనులారా తిలకించి, చెవులారా విని పులకరించాలని ఆశిస్తున్నారు. వీరి ఆశ త్వరలోనే శ్రీ కిరణ్ తీర్చగలరని ఆశిద్దాం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సాహిత్య సభా విసేషాలను తెలియ జేసినందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.