జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! మన తెలుగులో ప్రఖ్యాత రచయిత శ్రీ రావూరి భరద్వాజ యొక్క"పాకుడురాళ్ళు" అనే నవలకు జ్ఞాన పీఠ్ బహుమతి లభించడం మనకెంతో గర్వ కారణం.
ప్రముఖ భరద్వాజ్ నిగర్వి. సామాజిక స్పృహ వీరి రచనలో తొణికిసలాడుతుంది. నిజాలికి నిలువెత్తుటద్దాలు వీరి రచనలు. సుమారు పాతిక సంవత్సరాల తరువాత మన తెలుగు కవికి ఈ ప్రఖ్యాత పురస్కారం లభించడం తెలుగువారిమైన మనందరికీ గర్వ కారణం.శ్రీ విశ్వనాథ, శ్రీ సీ.నారయణరెడ్డి, శ్రీ రావూరి జ్ఞాన పీఠ్ బహుమతులందుకొని మన తెలుగు తేజాన్ని నలు దెసలా వ్యాపింప చేశారు.
మహనీయులైన శ్రీ రావూరి భరద్వాజకు ఆంధ్రామృతం మనస్పూర్తిగా అభినందనలు తెలియ జేస్తోంది.
జైహింద్
3 comments:
నిజమే ఇది తెలుగు వారికి ఎంతో గర్వ కారణం.
వారి పాకుడు రాళ్ళు నవల కృష్ణా పత్రికలో సీరియల్ గా వచ్చి నప్పుడు చదివాను.
మంచి విషయానికి మీరు వెంటనే స్పందించిన తీరు నాకు చాలా ఆనందంద కలిగించింది.
మీరు చెప్పే వరకూ వారికి ఈ అవార్డు వచ్చిన సంగతే తెలియదు.. టీ.వీ చూడడం లేదు. పేపరు చదవడం లేదు. ( రాజకీయాల మీద కోపంతో )
ప్రతి తెలుగు వాడు గర్వించదగు విషయము.శ్రీ రావూరి భర్ద్వాజ్ గారికి అభినందనలు మీద్వారా.
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ, కాకినాడ.
నమస్కారములు
పూజ్య గురువులు రావూరి భరద్వాజ గారికి అభినందన మందారములు. హైదరాబాదు ఆకాశ వాణిలో అనేకసార్లు దర్శించ గలగడం నా జన్మ సుకృతం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.