మాతృ దేవోభవ.
ఆంధ్ర భాషార్నవాన్ని అవలీలగా ఆపోసన పట్టి, తన ధిషణా పాటవంతో మేథో మదనం చేసి, ఆంధ్రామృతాన్ని అవలీలగా సృజింప జేస్తూ, యావదాంధ్రభాషాభిమానులకూ అంద జేస్తూ హృదయాలలో సహృదయ శిరోమణిగా స్థిరుఁడై అనితర సుసాధ్యమైన అవధాన పటిమతో ధారణా ప్రతిభతో అవధాన బ్రహ్మ రాక్షసుఁడుగా కీర్తింపబడే బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారికి జన్మనిచ్చి, ఆంధ్ర మాతకే కన్న తల్లి యైన గరికిపాటివారి మాతృమూర్తి తన భౌతిక దేహమును వీడి, స్వర్గపథము చేరడం నరసింహారావు గారికే కాక యావదాంధ్ర జనావళికీ బాధాకరము.సృష్టి ధర్మము అనుల్లంఘనీయము కదా! ఆ మాతృ మూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ,
శ్రీ గరికిపాటి నరసింహారావుగారికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నాము.
5 comments:
అమ్మను స్మరిస్తూ, అమ్మను ప్రేమిస్తూ అమ్మ అనగానె తన్మయత్వం పొందు శ్రీ గరికపాటి నరసింహరావుగారికి మాతృవియోగం కలిగినదని తెలిసి నాకు బాధకలుగుచున్నది. ఆ మాతృమూర్తి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
అమ్మ అమృతమూర్తి అనురాగ సంధాత్రి
ధరణిపైని అమ్మ దైవతమ్ము
ఆ వియోగ తాప మందున్న నరసింహ
ధైర్యమొకటె తీర్చు తాపమెల్ల
శ్రీ గరికిపాటి వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలుపు చున్నాను.
అమ్మహ నీయుం డెప్పుడు
అమ్మను తలవంగ మిగుల నార్ద్రత నొందున్
అమ్మ గలిసె దుర్గమ్మను
అమ్మా నీవిమ్మ 'అమ్మ' కాత్మకు శాంతిన్.
శ్రీ గరికపాటి నరసింహారావు గారికి మాతృ వియోగం తెలిసి చాలా బాధ కలైగింది. నా సానుభూతి తెలియ చేస్తున్నాను.
శ్రీగురుభ్యోనమ:
నమ్మెను దైవమే యనుచు నందరు మెచ్చగ కన్నతల్లినే
అమ్మకునంజలించి జగదంబకు వందనమాచరించుచున్
కమ్మని కంఠమున్ బలికె కావ్యసుధారసధారలెన్నియో
అమ్మవియోగ దు:ఖమును నార్పగ శక్యమె నారసింహుకున్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.