గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మార్చి 2012, గురువారం

శ్రీ ఖరకు వీడ్కోలు. ఆనంద నందన కు స్వాగతం.

జైశ్రీరామ్.
ప్రియ సాహితీ బంధువులారా! గత ఉగాది నుండి నేటి వరకూ కొందరిని మహోన్నత శిఖరాలకు అధిరోహింప జేసినదై, కొందరిని భయంకరముగా నిలదీసినదై ఎవరి ఖర్మను బట్టి వారిని నడిపించి, సుజన సుకరమైనదిగా ప్రసిద్ధి పొందిన ఖర సంవత్సరం నేటితో గడిచి పోతుంది. అట్టి ఖర నామధారియైన కాలస్వరూపునకు కృతజ్ఞతలు తెలుపుకొంటూ వీడ్కోలు చెప్పుదాం. 
రేపు మనలను తన చల్లని ఒడిలో సేదతీర్చి శుభాలనందించడం కోసం వస్తున్న ఆనందాల సునందనాబ్దికి 
హృదయ  పూర్వక స్వాగతం పలుకుదాం.
ఈ సందర్భంగా మొక్కవోని మనో ధైర్యంలో కష్టాల కడలిని  యీదుకుంటూ, సమస్యాయుత తమ జీవన గమనాన్ని ఆపరమాత్మపైగల విశ్వాసంతో ముందుకు నడిపించుకొని వస్తూ ఆదర్శ ప్రాయ జీవితం గడుపుతున్న మహోన్నత వ్యక్తులకు, మహోన్నత భావులకూ, మహాత్ములకూ, సహృదయులైన వారందరికీ కూడా నా అభినందనలు తెలుపుకొంటున్నాను.
రేపు ఉగాది నాడు పంచాంగ శ్రవణం అత్యంత ప్రయోజన కరమైనదిగా మహాత్ములు గ్రహించి మనకు తెలియ జేసిన దానిని బట్టి మనం తప్పక ప్రతీ యేటా పంచాంగ శ్రవణం చేస్తున్నాము. అవకాశం ఉన్నవారు 
ప్రత్యక్షంగా వినగలుగుతున్నారు. 
కంప్యూటరే తమ జీవితంగా మార్చుకున్నవారు కూడా ఈ పంచాంగ శ్రవణం చేయుటకు వీలుగా 
రేడియో జోష్ వారు ఈ కార్యక్రమాన్ని మనకందిస్తున్నారు. 
 నాచేత పంచాంగ పఠనం చేయించారు. అవకాశము, ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకుంటారని భావించి ఆ కార్యక్రమ వివరాలను తెలియజేసే రేడియో జోష్ ప్రకటన మీముందుంచుతున్నాను.
శుభమస్తు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.