గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

శ్రీ నేమాని, ఆ సుకవి., మా యింటికి దయచేసారు. ఆ దంపతులకు ధన్యవాదాలు.

జైశ్రీరామ్.
పాఠక మిత్రులారా!
నిన్నను వారు చెప్పిన విధంగా మాయింటికి వచ్చారు.
వారి రాకకు సంబంధించిన చిత్తరువులు వారి ఉపన్యాసము ఉన్నాయి. ప్రస్తుతము నేను బంధువులింటికి వివాహ సందర్భంగా వెళ్ళుతున్నందున ఆ వివరములను ఎల్లుండి ప్రచురించ గలనని మనవి చేయుచున్నాను. ఆలస్యానికి క్షంతవ్యుఁడను.
శుభమస్తు.
జైహింద్.
Print this post

3 comments:

Pandita Nemani చెప్పారు...

మిత్రులారా!
సకల సద్గుణ శోభితులు, సహృదయులు, నయవర్తనులు అయిన శ్రీ రామకృష్ణారావు వంటి వారితో పరిచయమే ఒక భాగ్యము. వారు బాగుగా గౌరవించి మంచి కార్యక్రమమును ఏర్పాటు చేసేరు. శ్రి చక్రవర్తి గారు వారి సతీమణితో కూడా వచ్చి ఆనందమును కలుగ చేసేరు. శ్రీ చింతా వారి అపార్టుమెంటులోని కుటుంబముల వారందరును ఆహ్వానించేరు నాకు పరిచయము చేసేరు. చాలా ఆనందముగ 3 గంటల కాలమును గడుప గలిగితిమి.
శ్రీ చింతా వారికి, శ్రీ చక్రవర్తి గారికి మరియు అక్కడకు వచ్చిన వారందరికి మా అభినందనలు కృతజ్ఞతలు.
శ్రీమతి జిలేబి గారికి, శ్రీమందాకిని గారికి మిగిలిన బ్లాగు మిత్రులకు కూడా అభినందనలు. స్వస్తి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Sree CH. K. V. Prasad ilaagannaaru.
క్షమించాలి! నిన్న 23వ తేది మేము మా ప్రాంతంలో కొన్న 150 గజాల స్థలం రిజిస్ట్రేషను కారణంగా మీరు పంపిన సమాచారం చూడలేకపోయాను, మీ ఇంటికి రాలేకపోయాను
అన్యధా భావించకండి.......

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఎం......త......అదృష్టం ! తమ్ముడూ ! శ్రీ నేమాని [ ఆది దంపతలు ] పండితోత్తములు , సరస్వతీ పుత్రులు , మీ ఇంటికి వచ్చారంటే ఇంక వేరే ఆనందం ఏముంది ? ఆ భాగ్యం నాకూ కలిగింది .కానీ నేను అనుకున్న రీతిగా అతిధి సత్కారం చేయ లేక పోయాను . ఇక్కడ నేను పరాధీనను . జీవితంలో ఎప్పడికైనా మళ్ళీ ఆ భాగ్యం కలిగితే నా జన్మ ధన్య మౌతుంది . ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.