గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఫిబ్రవరి 2012, గురువారం

హైదరాబాదు వచ్చిన పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారు.

జైశ్రీరామ్.
సాహితీ ప్రియ మిత్రులారా!
ఈ రోజు ఎంతో సుదినం. మన సాహితీ మిత్రులు శ్రీమాన్ పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారు సతీ సమేతంగా మియాపూర్‌లో మాయింటికి సాయంత్రం 6.00 గంటలకి వస్తున్నారు. ఆది దంపతులవలె వారు మాయింటికి రావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.
మన బ్లాగ్ మిత్రులకూ వారంటే అపారమైన గురు భావన. అందు చేతనే  వారిని చూడ దలచుకొన్న వారికి ఇది ఒక చక్కని అవకాశం కదా అని భావించి,  ఈ విషయాన్ని ఈ విధంగా తెలియ జేస్తున్నాను.
మీరు  శ్రీ నేమాని వారిని కలుసుకోవడం కోసం  మాయింటికి రావలసినదిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
నా సెల్ నెంబర్.9247238537. 
నమస్తే.
జైహింద్.
Print this post

6 comments:

Zilebi చెప్పారు...

అయ్యా చింతా వారు,

ఈ నేమాని వారు, శంకరాభరణం లో వ్రాయు నేమాని వారూ ఒక్కరే నా?

౨. వారికి వారి శ్రీమతి గారికి సాదర ప్రణామములు జిలేబీ తరపున!

చీర్స్
జిలేబి.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

మియాపూర్ లో పేలుళ్ళు జరిగినట్టు వార్తల్లో చెపుతున్నారు. మీ వైపు కాదుకదా?

చక్రవర్తి చెప్పారు...

జిలేబీ గారు,

నిజమేనండి. మీరు ప్రస్తావించిన శంకరాభరణం అనే బ్లాగులో సాహిత్యాన్ని పండించే సహృదయులు వీరే. వీరి గురించి నేను ఏమి వ్రాసినా అది నా భాషయందు అతిశయము ఆవుతుంది. నాకు భావవ్యక్తీకరణలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నా భాషయందు తప్పు లెన్నకుండా చదువుకోగలరు.

ప్రాతః స్మరణులు, పూజ్యులు, గురుతుల్యులైన వీరు ఎన్ని పద్యాలు ఆసువుగా వ్రాసారో వారి స్పందనలే తెలియజేస్తాయి. వీరిచే రచించబడిన పలు ప్రచురణల గురించి నేను తెలియజేస్తే సూర్యుని వెలుగులో ఉన్న వారికి సూర్యుని గురించి తెలియజేసినట్లౌతుంది. ఇంతటి సరస్వతీ పుత్రులకు ఆతిద్యం ఇస్తున్న చింతా రామకృష్ణారావుగారు ధన్యులు. భాగ్యనగరంలోనే ఉంటూ వీరిని దర్శించుకునే భాగ్యానికి నోచుకోక మఱియు వీలు చేసుకునే సౌకర్యం లేకపోవడం మా దౌర్బాగ్యం.
ఏది ఏమైనా ఈశ్వరానుగ్రహం మాయందు ఉంటే వీరి దర్శన భాగ్యం మాకు కలుగుతుందని ఆశిస్తు మీరు అడిగినదానికి నా సమాధానం, అవును వీరు వారు ఒక్కరే అని.

ఊకదంపుడు చెప్పారు...

ఆశు కవులిరువురునాత్మీయతఁగలువ
చేరనైతినేను సెలవులేక
గురువులనడుమనులఘువునునేఁ గూర్చొండి
నేర్వ రగణమైన, నెపము జారె!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Sree Arka Somayaji ilaagannaaru.
అయ్యా దూరాన ఉన్న మాకా అదృస్టం కొంచెం కూడా లేదు.వివరాలు చిత్రాలతో మీరెలాగూ పంపుతారుగా!పైగా వారిని గూర్చి పరిచయం కూడా చెయ్యండి!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Sree Krishna rao jallipalli ilaagannaaru.
Meeku mariyu vaarini darshinchu kunna vaarandariki SHUBHAN kalagaalani...
Mee bhavadeeyudu
Krishna Rao Jallipalli

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.