గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఫిబ్రవరి 2012, శనివారం

మియాపూర్ జయప్రకాశ్ నారాయణ్ నగర్ లో అష్టావధానం.

జైశ్రీరామ్.
సాహితీ బంధువులారా!
శ్రీ కట్టమూరి చంద్రశేఖరం అవధానిచే తే.12 - 02 - 2012 న  జయప్రకాశ్ నారాయణ్‌నగర్‌
( హైదరాబాద్. మియాపూర్ ) లో  అష్టావధానం ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.
మీరు తప్పక రాగలరని ఆశిస్తున్నాను. వచ్చే అవకాశం ఉన్న వారు మీ వివరాలను నాకు తెలియ జేయ గలరని ఆశిస్తున్నాను. సందర్భానుసారం మనలో ఎవరినయినా పృచ్ఛకులుగా అక్కడ గ్రహించే అవకాశం కూడా ఉండ వచ్చునని భావిస్తున్నాను. పాల్గొనే ఉత్సాహవంతులు తాము నిర్వహించగల అనుభవమున్న అంశాన్ని కూడా నాకు తెలియ జేయ మనవి.ఇది కేవలం మన ప్రాతినిధ్యాన్ని అక్కడ బలపరచడానికి నేను ప్రయత్నించడానికి మాత్రమే. అవకాశం కలగడమన్నది అక్కడ నిర్వాహకుల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.
కార్యక్రమం ఖరారు కాగానే మళ్ళీ మీ అందరికీ తెలియ జేయ గలను.    
జైహింద్.      
Print this post

16 comments:

శ్యామలీయం చెప్పారు...

అవధానకార్యక్రమం ముదావహం.
నేను కూడా హాజరవుదా మనుకుంటున్నాను.
పృఛ్ఛకుడి పాత్రకు సిధ్ధం.

కంది శంకరయ్య చెప్పారు...

అయ్యో! ఎంత మంచి అవకాశాన్ని కోల్పోతున్నాను! అదే రోజు మా అబ్బాయి నిశ్చితార్థం ఉంది. మరోరోజు అయితే ఎలాగైనా వచ్చేవాణ్ణి. కార్యక్రమం విజయవంతం అగును గాక!

Zilebi చెప్పారు...

చింతా వారు,

అసందర్భ ప్రసంగం రోలు ఏమన్నా వుంటే నాకు ఇవ్వ గలరు !!

అవధానం అయ్యేక దీని మీద మీరు ఒక పూర్తి నిడివి టపా వ్రాయాలని కోరుతూ

జిలేబి.

సో మా ర్క చెప్పారు...

అయ్యా!సమాలోచన (రాజమండ్రి)బులుసు సీతా రామ శాస్త్రి గారి పత్రికలో రచనల ద్వారా !పరోక్షంగా మీరూ నేను పూర్వ పరిచితులమే
!నేను ఆ రోజు హైదరా బాదులోనే ఉంటాను.కానీ అదే రోజు రాత్రి నరసాపూర్ ట్రైన్ కి నా తిరుగు ప్రయాణం రిజర్వేషన్ .కాబట్టి దొరికిన అవకాశాన్ని కోల్పోతున్నానేమో?నేను ప్రష్టగా పాల్గొనగలను కారణం ఎన్నో అవధానాల్లో పాల్గొన్నాను..కానీ అవకాశం లేదు.అయినా ప్రయత్నిద్దాం!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యులారా! హృదయ పూర్వక నమస్సులు.
మీ యొక్క వివరాలను దయతో మీరు నాకు తెలియ జేఉఅ గలిగితే అవధాన నిర్వాహకులకు మీ గురించి నేను వివరించే అవకాశం నాకు కల్పించినవారవతారు.
నా సెల్ నెంబరు. ౯౨౪౭౨౩౮౫౩౭.
మీ అందరి అభిమానానికీ ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఎం ....త అదృష్ట వంతులు ? . నేను అక్కడ ఉండి ఉంటే తప్పక వచ్చి ప్రేక్షకుల్లో ఉండి ఆనందించే దాన్ని. ఇప్పుడు ప్చ్ !
తర్వాత జరిగిన కార్యక్రమం గురించి , చింతా వారు అమృతానికి అందిస్తే కొంతైనా ఆనందిం చగలం [ నాలాగ రానివారు ]

Pandita Nemani చెప్పారు...

అష్టావధానము సరసముగా శ్రోతృజనరంజకముగా జరగాలనీ, అవధాని చి. కట్టమూరి చంద్రశేఖర రావు బాగుగా సత్కారముల నందుకోవాలని మా శుభాశీస్సులు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అయ్యా! జిలేబీగారూ! మీ పేరు, చిరునామా వగైరా వివరాలు కావాలి. ఒక్క సారి మీతో మాటాడే అవకాశం నాకు ఇవ్వ గలరా?
నా సెల్ నెంబరు ౯౨౪౭౨౩౮౫౩౭.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ శ్యామల రావు గారు, జిలేబీ గారు, సోమార్క గారు, ౧౨ వ తేదీన నిర్వహింప నున్న అష్టావధానంలో ప్చ్ఛకులుగా సభనలరింప జేయనున్నందులకు ఆనందంగా ఉంది. వారికి అభినందనలు. అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

స్సహితీ ప్రియులారా! ఈ సాహితీ సభకు సహృదయులందరూ ఆహ్వానితులే. అవకాశం కల్పించుకొని తప్పక రాగలరని ఆశిస్తున్నాను.తమతో పాటు సాహితీ మిత్రులను కూడా తీసుకొని రావలసినదిగా కోరుకొంటున్నాను.
వచ్చేవారి వివరాలు నాకు తెలియ జేయగలరని ఆశిస్తున్నాను.

Sanath Sripathi చెప్పారు...

మంచి అవకాశాన్ని పొందలేకపొతున్నందుకు చింతిస్తున్నాను. సభ రంజకంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ..

Zilebi చెప్పారు...

శ్రీ చింతా వారు,

అయ్య బాబోయ్ నాకంత సీను లేదండీ. సరదాకి అలా అన్నాను.

అప్పుడప్పుడు (ఎల్లప్పుడూ) అలా అసందర్భపు ప్రసంగమైన కామెంట్లు కొట్టి అలవాటులో పొరపాటు గా అలా అన్నాను అంతే.

మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదములు.

జిలేబి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నాయనా!జిలేబీ!నాకు నీ పేరేమిటో తెలియ జేస్తే నీ సొమ్మేంపోతుందయ్యా బాబూ. నీవు తప్పక అవధానానికి వస్తున్నావని నిర్వాహకులకు చెప్పేసాను. నా మాట పోయేలా చేయవని నా నమ్మకం. నీకు ఆసక్తి ఉంటే పృచ్ఛకుడుగా వ్యవహరిద్దువుగాని. కాదంటే ప్రేక్షకుడుగా ఉండి ఉత్సాహపరచుదువుగాని. తప్పక రావాలి.
ముందుగా మన యింటికి రావాలి.
నీకు నేరుగా మెయిల్ చేద్దామంటే నోరిప్లై కామెంట్ పంపుతావునువ్వు. నేనేం చేయలేక ఇక్కడే నీకు తెలియ జేయవలసి వస్తోంది.
నీ మెయిల్ ఎడ్రస్తో పాటు నీ పూర్తి పేరు వివరాలు కూడా తెలియ జేయగలవని ఆశిస్తున్నాను.
శుభమస్తు.

Zilebi చెప్పారు...

అయ్యా చింతా వారు,

మీకు కష్టం కలిగించినందులకు క్షమాపణలు!

మీ అభిమానానికి నెనర్లు. మీ ఆహ్వానికి ధన్యవాదములు.

ఆ పై మీరు ,శ్రీ శ్యామలీయం మాష్టారు తో చేర్చి ఈ అష్టావధానం తరువాయి దాని గురించి రాసిన ఎడల చదివి సంతోషం చెందుతాను !!

శ్రీ గురుభ్యో న్నమః.

చీర్స్
జిలేబి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ గురుభ్యో న్నమః అనే వ్రాయడానికి బదులు
శ్రీ గురుభ్యో నమః అని వ్రాయడం సముచితం.

Zilebi చెప్పారు...

శ్రీ చింతా వారు,

నెనర్లు.

జిలేబి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.