జైశ్రీరామ్.
శ్లో|| కల్పాయుషాం స్థాన జయాత్పునర్భవాత్|
క్షణాయుషాం భారత భూజయో వరమ్||
క్షణేన మర్త్యేన కృతం మనస్వినః |
సం న్యస్య సం యాత్య భయం పదం హరేః ||
కః-
భరతావనిపై బ్రతుకుట
వరమది క్షణమైన. హరియె భక్తి స్పృహలన్
కరుణను కలిగించు నభయ
వరదుఁడగు. జనింప నేల పర లోకములన్?
భావముః-
వందల - వేల ఏళ్ళ తరబడి ఆయుష్షున్న చోట పుట్టి ఏం లాభం? ఒక్క క్షణకాలం ఆయుష్షుతోనైనా సరే భరతభూమిపై జన్మించడం గొప్పవరం. శ్రీహరి స్వయంగా ప్రసన్నుడై తన పట్ల భక్తిని - స్పృహనీ కల్గించే ఈ చోట ఆయన అభయ ప్రదానం అందరికీ అందుతూంటుంది !
జైహింద్.
3 comments:
అవును మన భారతావని పై జన్మించడం , అందునా మానవ జన్మ మరింత మహోన్నత మైనది. ఇక " పాండితీ స్రష్టలకి " అంత కంటె అదృష్టం [ పుణ్యం ] వేరే ఏముంది ? అమృత గుళికలను అందించిన పండితులు " శ్రీ చింతా రామ కృష్ణా రావుగారు " అభినందనీయులు
మీ భావము చాల బాగున్నది. అభినందనలు. నా పద్యమును చూడండి.
శ్రీమంతంబగు భారత
భూమిని జన్మంబు గనుట పుణ్యఫలంబౌ
నా మహిమ మితర దేశపు
సీమలలో లేదు లేదు చింతా సుకవీ!
మీ భావము చాల బాగున్నది. అభినందనలు. నా పద్యమును చూడండి.
శ్రీమంతంబగు భారత
భూమిని జన్మంబు గనుట పుణ్యఫలంబౌ
నా మహిమ మితర దేశపు
సీమలలో లేదు లేదు చింతా సుకవీ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.