సాహితీ బంధువులారా!
నేను 1973 లో రైలులో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రయాణీకులలో ఒకరు సాహితీ ప్రియులై ఉంటారు. సాహితీ ప్రసంగం చేస్తూ ఒక సమస్యను పూరించడం కోసం ఇచ్చారు. ఆ సమస్యకు నేనానాడే అక్కడే పూరణ చేసి వారికి వినిపించాను.
అది నేనిప్పుడు మీ ముందుంచుతున్నాను.
"భామకు మీసముల్ మొలిచె. బాపురె! పూరుషుఁడూనె గర్భమున్"
నాపూరణమును వ్యాఖ్యలలో చూడనగును.
మీరు ఈ సమస్యను సునాయాసంగా పూరించ గలరని మీ పూరణ ద్వారా పాఠకులనలరింప చేస్తారనీ ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post
నేను 1973 లో రైలులో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రయాణీకులలో ఒకరు సాహితీ ప్రియులై ఉంటారు. సాహితీ ప్రసంగం చేస్తూ ఒక సమస్యను పూరించడం కోసం ఇచ్చారు. ఆ సమస్యకు నేనానాడే అక్కడే పూరణ చేసి వారికి వినిపించాను.
అది నేనిప్పుడు మీ ముందుంచుతున్నాను.
"భామకు మీసముల్ మొలిచె. బాపురె! పూరుషుఁడూనె గర్భమున్"
నాపూరణమును వ్యాఖ్యలలో చూడనగును.
మీరు ఈ సమస్యను సునాయాసంగా పూరించ గలరని మీ పూరణ ద్వారా పాఠకులనలరింప చేస్తారనీ ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
8 comments:
భామ ప్రమీల రాజ్యమున పద్ధతి యెట్టుల నుండెనో కదా
స్వామిరొ! చూచినాడవొకొ జంబల పంబ సినీమ వింతల
బ్బో! మహిళామణుల్ మగలు, పూరుషులంగనలౌట నొప్పుగా
భామకు మీసముల్ మొలిచె పూరుషుడూనె గర్భమున్
ప్రేమను బెట్టినంత కడుపింతగ నుబ్బగ మెక్కె భర్త నా
చామయు పాయసంబు గొనఁ జక్కఁగ మూతిని కొంత చేరె నౌ
రా మఱి మేలమాడుచు పరస్పర మివ్విధిఁ బల్కి రయ్యెడన్
"భామకు మీసముల్ మొలిచె బాపురె!" "పూరుషుఁ డూనె గర్భమున్"
శ్రీగురుభ్యోనమ:
పామరులైన యాదవులు పాపము నెంచక గేలిజేయుచున్
కోమలి రూపమున్ పులిమి కోకను జుట్టిన జోదు జూపగా
నాముని సన్నిధానమున నాగ్రహమందుచు శాపమివ్వగా
భామకు మీసముల్ మొలిచె పూరుషుడూనె గర్భమున్
భామకు మీసముల్ మొలిచె బాపురె, పూరుషుడూనె గర్భమున్
పాములకండగా నిలిచె బభ్రువటంచు జనించు వార్తలున్,
తామది జాతివైరములు దల్పక పిల్లి విలోమ సఖ్యతల్
ఏమని చెప్పనేర్తునికనీకలికాలమునందు చిత్రముల్
బభ్రువు = ముంగిస,
విలోమము = శునకము
మామయు అత్తయున్ తనను మన్నన జేయుచు' చాక్లె టివ్వలే'
దేమని కోపగించి మరి వెంటనె ' బుజ్జులు ' వారి చిత్రమే
నామును దీసి గీసె గద నచ్చిన రీతిగ; గీసి చూడగా
"భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్"
ఈ సమస్యకు నా పూరణము.
ప్రేమ దలిర్ప దంపతులు పెద్దగ జీవన యాత్రఁ జేసి రా
ప్రేమకు మారు రూపముగ పిల్లల బొందగ నౌషధంబుల
న్నేమర పాటుచే గొనిరి యిద్దరు నొక్కరి దొక్క రక్కటా!
"భామకు మీసముల్ మొలిచె. బాపురె! పూరుషుఁడూనె గర్భమున్"
గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణవలెనే ఉన్న నా పూరణ కూడా:
ఓ మహిళామణిన్,బతి,నూహలదల్చియె,వంగ్యచిత్రము
న్నేమరపాటునన్,రచననేన్సలుపన్ గనినాప్తమిత్రుడే-
సేమముతప్పె;నాదుఘనసేవలచేతనుతెప్పరిల్లనెన్:
భామకు మీసముల్ మొలిచె బాపురె!" "పూరుషుఁ డూనె గర్భమున్
ఆర్యా! పండిత వరా!
మొత్తంమీద జంబలకడ పంబ సినీమా ఎంత పుణ్యం చేసుకొంటే మీ దృష్టిని కూడా ఆకర్షించిందో!
చాలా చమత్కారంగా ఉంది మీ పూరణ! ధన్యవాదాలు.
ఆర్యా! శంకరయ్య గారూ! భార్యా భర్తల చతురోక్తులతో పూరణ చేసి మమ్ముల నలరించిన మీకు ధన్యవాదములు.
శ్రీపతి శాస్త్రి గారూ!
ద్వారక దాకా వెళ్ళి ద్వాపర యుగ వృత్తాన్ని అద్భుతంగా తలపిస్తూ పూరించిన మీ పూరణ ఎంతో ఆనందం కలిగించింది. మీకు నా అభినందనలు.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ! మొత్తంమీద లోకంలోని వార్తలుగా మళ్ళించి మీ భావ నిపుణతను పద్యంద్వారా ప్రకటించారు.చాలా సంతోషం కలిగించారు.
అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ! చక్కని విచిత్రమైన చిత్రాన్ని గీయించి, పూరణకు వన్నెతెచ్చిన మీకు నా అభినందనలు.
చిరంజీవీ! రామ కృష్ణా! మొత్తంమీద వ్యంగ్య చిత్రంవేయించి చేసిన నీ పూరణ సంతోషదాయకంగా ఉంది. అభినందనలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.