గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2026, బుధవారం

పరోపదేశ వేలాయాం...... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్. 

ఓం శ్రీమాత్రే నమః🙏🏻


శ్లో.  పరోపదేశ వేలాయాం   -  సర్వే వ్యాసపరాశరాః,

ధర్మే స్వయమనుష్టానం  -  కస్యచిత్తు మహాత్మనః.


ఆ.వె. ధర్మ బోధ చేయ ధరణి పైనందరు

నల పరాశరులును వ్యాసులె కద,

ఆచరించువార లందులో కొందరే

యుండుదురు మహాత్ము లుర్విపైన.


భావము.  పరులకు బోధించు వేళలలో అందరూ వ్యాస పరాశరులే.

వారేధర్మమునైతే బోధింతురో ఆ ధర్మము స్వయముగానాచరించుమహాత్ములు కొందరే ఉందురు.


అమ్మ దయతో

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.