జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
🙏🏽
శ్రీమదాది పరాశక్తి!
రచన .. చింతా రామకృష్ణారావు.
సీ. ఓంకార సంభాస! ఐంకార వాగ్యోష! హ్రీంకార, శ్రీంకార హృత్ ప్రకాశ!
పంకేరుహాక్షీ! యలంకారమీవేగ యంకించి నే వ్రాయు శంకృతులను,
సంకాసమేలేని శంకాపహారీ! కుసాంకర్యముల్ బాపు పంకజ ముఖి!
లంకేశపూజ్యుం డలంకారమై సృష్టి నుంకించి చేయంగ నూతమిచ్చి,
గీ. అంకితంబైన భక్తులకండవగుచు,
అంతమొందించి దౌష్ట్యంబు లనితరముగ,
శాంకరీ! లోకములనేలు శంకరనుత!
శ్రీమదాది పరాశక్తి! ప్రేమఁ గనుమ.
సీ. భారతాంబకు నేడు బాధలన్ కలిగించు పాపాత్ము లిలపైమ ప్రబలినారు,
మానవత్వము నేడు మటుమాయమయ్యెను, గౌరవ భావముల్ కరిగె నేడు,
స్త్రీ బాల వృద్ధుల క్షేమంబు నెంచక పీడించు మూర్ఖులు పెరిగినారు,
పూజారులను నేడు పూతికపుల్లగా చూచి కొట్టెడు రక్కసులు జనించ్రి,
సీ. శ్రీమదాదిపరాశక్తి యేమి నీవు
చూచి, చూడక యున్నట్లు వేచినావు?
కాళికాశక్తివై నీవు కదలి రమ్ము,
దుష్ట సంహారమొనరించి తుష్టినిమ్ము.
🙏🏽🙏🏽🙏🏽
జైహింద్.
Print this post
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.