గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఏప్రిల్ 2025, శనివారం

దత్తానువాదము. శ్లోకానికి పద్యం. శ్రీ మరుమాముల దత్తాత్రేయావధాని.

 జైశ్రీరామ్.

శ్లో.  చిత్రం దేవి విదేహరాజనగరే ధాత్రీ తలాత్ కన్యకాః 

జనయంతే కిల సంప్రతి ప్రభు మయా చిత్రాతి చిత్రం శ్రుతమ్

సాకేతేఖలు పాయసాన్న కబలా త్ప్రాదుర్భవంత్యర్భకాః 

సీతారామ మనోజ్ఞ భాషణమిదం పాయాదపాయా జ్జగత్

ఉ.  భూమిని దున్నుచో పుడమి పుట్టిరి బిడ్డలటంచు వింటిమే?

భామిని చిత్రమే, యనెడు ప్రాణవిభున్ గని సీత యిట్లనెన్

స్వామి యదేమి చిత్ర మిల పాయస భక్షణ జేసినంతనే

శ్రీమదయోధ్యరాణులకు చెన్నుగ పూరుషులుద్భవించిరే?

రాముఁడు సీత పల్కు చతురంబగు పల్కులు మిమ్ము గాచెడున్!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.