జైశ్రీరామ్
శ్లో. చత్వారో విత్త దాయాదాః - ధర్మ, భూపాగ్ని తస్కరాః I
జ్యేష్ట భ్రాత్రవమానేన - త్రయః కుప్యంతి సోదరాః II
తే.గీ. ఆర్జిత ధనమునకుఁ దమ్ము లరయ నల్గు
రిలను, ధర్మ భూపాగ్నులు నహరహంబు
చూచు దొంగలు, ధర్మమున్ చుల్కనఁగొను
వానిపై కోపమున గొంద్రు వాని ధనము.
భావము. మనము సంపాదించుకొన్న ధనానికి నలుగురు దాయాదులు.
వారు ధర్మము, ప్రభువు, అగ్ని, దొంగ. వారు దాయాదులైనప్పటికీ
పెద్దన్నపై గౌరము అపారముగా కలవారు. కావుననే మనము
మన సంపాదనను ధర్మము కొరకై వెచ్చించినచో మిగిలినవారు మన
సమీపమునకు రారు. మనము మొదటివానికి అన్యాయము చేసినచో
అనగా ధర్మము చేయకుండా కూడబెట్టుకొంటూ కూర్చున్నచో
మిగిలిన ముగ్గురికీ కోపం వచ్చి మనపై దండెత్తి ధనం మొత్తం హరిస్తారు.
అనగా మనం ధర్మ చేయుట విషయంలో నిర్లక్యముగా ఉండరాదు.
సంపాదించినది ధర్మము చేయుచుండ వలెను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.