జైశ్రీరామ్.
సోమరాజ,భీమ జంగమా!శూలి శౌరి చంద్ర మౌళి!శూర ధీర విక్రమార్కమా!
లేమ గంగ,గౌరి వల్లభా!లీల నాట్య లోక పాల!లేదు సాటి నీ కుమాధవా!
భాము లెల్ల ద్రోలు దేవరా!ఫాల నేత్ర, నీలి కంఠ!పారగుండ వీవె శంకరా!
నీమ నిష్ట గొల్తు సర్వదా!నేల నింగి సర్వ మీవె!నీర ధారి గావు మమ్ములన్!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృ తి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
1.గర్భగత"సోమరాజ"వృత్తము,
సోమ రాజ భీమ జంగమా!
లేమ గంగ గౌరి వల్లభా!
భాము లెల్ల ద్రోలు దేవరా!
నీమ. నిష్ట గొల్తు సర్వదా!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు9,అక్షరము లుండును,
2.గర్భగత"భీమ"వృత్తము,
శూలి శౌరి చంద్ర మౌళి!
లీల నాట్య లోక పాల!
ఫాల నేత్ర నీలి కంఠ!
నేల నింగి సర్వ మీవె!
అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,
3,గర్భగత"జంగమ"-వృత్తము,
శూర ధీర విక్ర మార్కమా!
లేరు సాటి నీ కుమాధవా!
పారగుండ వీవె శంకరా!
నీర ధారి గావు మమ్ములన్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
4.గర్భగత"గంగేశ"వృత్తము,
సోమ రాజ భీమ జంగమా!శూలి శౌరి చంద్ర మౌళి!
లేమ గంగ గౌరి వల్లభా!లీల నాట్య లోక పాల!
భాము లెల్ల ద్రోలు దేవరా!ఫాల నేత్ర నీలి కంఠ!
నీమ మొప్ప గొల్తు సర్వదా! నేల నింగి సర్వ మీవె!
అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు17!అక్షరము లుండును,
యతి,10,వ యక్షరము నకు చెల్లును,
5.గర్భగత"'ఉమాపతి"'వృత్తము,
శూలి శౌరి చంద్ర మౌళి!సోమ రాజ భీమ జంగమా!
లీల నాట్య లోక పాల!లేమ గంగ గౌరి వల్లభా!
ఫాల నేత్ర నీలి కంఠ!భాము లెల్ల ద్రోలు దేవరా!
నేల నింగి సర్వ మీవె!నీమ మొప్ప గొల్తు సర్వదా!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము నందలిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు17,అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,
6.గర్భగత"-దేవరా"వృత్తము,
సోమ రాజ భీమ జంగమా!శూరధీర విక్ర మార్కమా!
లేమ గంగ గౌరి వల్లభా!లేరు సాటి నీ కుమాధవా!
భాము లెల్ల ద్రోలు దేవరా!పారంగుడ వీవె శంకరా!
నీమ మొప్ప గొల్తు సర్వదా!నీర ధారి గావు మమ్ములన్!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18.అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
7.గర్భగత;-ఫాలనేత్ర వృత్తము,
శూర ధీర విక్ర మార్కమా!సోమరాజ భీమ జంగమా!
లేరు సాటి నీ కుమాధవా!లేమ గంగ గౌరి వల్లభా!
పారంగుడ వీవె శంకరా!భాము లెల్ల ద్రోలు దేవరా!
నీర ధారి గావు మమ్ములన్!నీమ మొప్ప గొల్తు సర్వదా!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,68>@
యతి,10,వ యక్షరము నకు చెల్లును,
8.గర్భగత"పారగ"వృత్తము
శూలి శౌరి చంద్ర మౌళి!శూర ధీర విక్ర మార్కమా!
లీల నాట్య లోకపాల!లేరు సాటి నీ కుమాధవా!
ఫాల నేత్ర నీలి కంఠ!పారంగుడ వీవె శంకరా!
నేల నింగి సర్వ మీవె!నీర ధారి గావు మమ్ములన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు17,అక్షరము లుండును
యతి9,వ యక్షరమునకు చెల్లును,
9,గర్భగత"నీర ధారి"వృత్తము,
శూర ధీర విక్ర మార్కమా!శూలి శౌరి చందంర మౌళి!
లేరు సాటి నీ కుమాధవా!లీల నాట్య లోక పాల!
పారంగుడ వీవె శంకరా!ఫాల నేత్ర నీలి కంఠ!
నీర ధారి గావు మమ్ములన్!నేల నింగి సర్వ మీవె!
అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
10,గర్భగత"శూలి"వృత్తము,
శూలి శౌరి చంద్ర.మౌళి!సోమ రాజ భీమ జంగమా! శూర ధేర విక్ర మార్కమా!
లీల నాట్య లోక పాల!లేమ గంగ గౌరి వల్లభా! లేరు సాటి నీ కుమాధవా!
ఫాల నేత్ర నీలి కంఠ!భాము లెల్ల ద్రోలు దేవరా!పారంగుడ వీవె శంకరా!
నేల నింగి సర్వ మీవె!నీమ మొప్ప గొల్తు సర్వదా!నీర ధారి గావు మమ్ములన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు9,18 అక్షరములకు చెల్లును,
11,గర్భగత"శౌరి"వృత్తము,
సోమ రాజ భీమ జంగమా!శూర ధీర విక్ర మార్కమా!శూలి శౌరి చంద్ర మౌళి!
లేమ గంగ గౌరి వల్లభా!లేరు సాటి నీ కుమాధవా!లీల నాట్య లోక పాల!
భాము లెల్ల ద్రోలు దేవరా!పారంగుడ వీవె శంకరా!ఫాల నేత్ర నీలి కంఠ!
నీమ మొప్ప గొల్తు సర్వదా!నీర ధారి గావు మమ్ములన్!నేల నింగి సర్వ మీవె!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు, పాదమునకు"26"అక్షరములుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
12,గర్భగత"-చంద్రమౌళి"వృత్తము,
శూర ధీర విక్ర మార్కమా!సోమ రాజ భీమ జంగమా!శూలి శౌరి చంద్ర మౌళి!
లేరు సాటి నీ కుమాధవా!లేమ గంగ గౌరి వల్లభా!లీల నాట్య లోక పాల!
పారంగుడ వీవె శంకరా!భాము లెల్ల ద్రోలు దేవరా!ఫాల నేత్ర నీలి కంథ!
నీర ధారి గావు మమ్ములన్!నీమ మొప్ప గొల్తు సర్వదా!నేల నింగి సర్వ మీవె!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
13.గర్భగత"-నట శేఖర"వృత్తము,
శూలి శౌరి చంద్ర మౌళి!శూర ధీర విక్ర మార్కమా!సోమ రాజ భీమ జంగమా!
లీల నాట్యలోల పాల!లేరు సాటి నీ కుమాధవా!లేమ గంగ గౌరి వల్లభా!
ఫాల నేత్ర నీలి కంఠ!పారంగుడ వీవె శంకరా!భాము లెల్ల ద్రోలు శంకరా!
నేల నింగి సర్వ మీవె!నీర ధారి గావు మమ్ములన్!నీమ మొప్ప గొల్తు సర్వదా!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
14,గర్భగత"నింగి నేల,"వృత్తము,
శూర ధీర విక్ర మార్కమా!శూలి శౌరి చంద్ర. మౌళి!సోమ రాజ భీమ జంగమా!
లేరు సాటి నీ కుమాధవా!లీల నాట్యలోల పాల!లేమ గంగ గౌరి వల్లభా!
పారంగుడ వీవె శంకరా!ఫాల నేత్ర నీలి కంఠ!భాము లెల్ల ద్రోలు శంకరా!
నీర ధారి గావు మమ్ములన్!నేల నింగి సర్వ మీవె!నీమ మొప్ప గొల్తు సర్వదా!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.